ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలకు ఫీజులు ఖరారు: జీవో జారీ చేసిన తెలంగాణ సర్కార్

By narsimha lodeFirst Published Jun 23, 2021, 12:47 PM IST
Highlights

 ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షల ఫీజుల ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారంనాడు  తెలంగాణ సర్కార్ 40 జీవోను జారీ చేసింది. 

హైదరాబాద్: ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షల ఫీజుల ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు బుధవారంనాడు  తెలంగాణ సర్కార్ 40 జీవోను జారీ చేసింది. సాధారణ వార్డుల్లో ఐసోలేషన్ పరీక్షలకు రోజుకు గరిష్టంగా రూ. 4 వేలు వసూలు చేయాలని నిర్ధారించారు. ఐసీయూ గదిలో రోజుకు గరిష్టంగా రూ. 7,500 గా నిర్ణయించారు.వెంటిలేటర్ పై ఐసీయూలో చికిత్స చేస్తే రోజుకు రూ. గరిష్టంగా రూ. 9 వేలు వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పీపీఈ కిట్ ధర రూ. 273 కంటే ఎక్కువ వసూలు చేయవద్దని ప్రభుత్వం తేల్చి చెప్పింది. 

హెచ్ఆర్ సిటీ రూ.1995 , డిజిటల్  ఎక్స్‌రే  రూ. 1300, ఐఎల్ 6- రూ. 1300 గా గుర్తించారు. డీడైమర్  కు రూ. 300, సీఆర్‌పీకి రూ. 500, ప్రొకాల్ సీతోసిన్ కు రూ. 1400, పెరిటీన్ కు రూ. 400, ఎల్‌డీహెచ్ కు రూ. 140 గా నిర్ణయించారు. సాధారణ అంబులెన్స్ కు కిలోమీటరుకు రూ. 75 గా నిర్ణయించారు. లేటెస్ట్ అంబులెన్స్ కు కిలోమీటరుకు రూ. 125 వేలుగా వసూలు చేయాలని ప్రభుత్వం ఈ జీవోలో స్పష్టం చేసింది. 

కరోనా చికిత్సలపై తెలంగాణ హైకోర్టులో చికిత్స జరిగిన సమయంలో  ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఫీజుల విషయమై ఎందుకు నిర్ధారణ చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. గత ఏడాది నిర్ణయించిన ధరలను ఎలా వసూలు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.  దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జివోను విడుదల చేసింది.  

click me!