తెలంగాణ ఆర్టీసీకి కొత్త ఎండీ..?: కేసీఆర్ కసరత్తు, పరిశీలనలో వీరే.....

By Nagaraju penumalaFirst Published Oct 16, 2019, 3:17 PM IST
Highlights

ఆర్టీసీ ఎండీ పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో కొత్త ఎండీని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 
 

హైదరాబాద్: తెలంగాణాలో ఖాళీగా ఉన్న కీలక పదవులను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కీలక శాఖకు అధికారులను నియమించకపోవడంతో ఆ ఖాళీలను భర్తీ చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఇకపోతే ఆర్టీసీ ఎండీ పోస్టు ఖాళీగా ఉన్న నేపథ్యంలో కొత్త ఎండీని నియమించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఆర్టీసీ ఎండీ పోస్టు ఖాళీగా ఉండటంపై హైకోర్టు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ సమ్మెపై మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. తమ వాదనలు వినేందుకు ఆర్టీసీ ఎండీ లేరని ఆర్టీసీ జేఏసీ తరపు లాయర్ వాదనలు వినిపించడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఆర్టీసీ ఎండీ పోస్టును త్వరగా భర్తీ చేయాలని సూచించింది. అలాగే తెలంగాణలోని కీలక శాఖలను సైతం భర్తీ చేయాలని ఆదేశించింది. అంతేకాదు తెలంగాణ ప్రభుత్వంపై కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. 

ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మెల్కోంది. ఆర్టీసీ ఎండీ పోస్టును బుధవారం సాయంత్రానికి భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీ ఎండీ నియామకంపై సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లను పరిశీలిస్తుంది ప్రభుత్వం. 

సీనియర్ ఐపీఎస్ అధికారి, తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పేరు మెుదటిగా వినిపిస్తోంది. అకున్ సబర్వాల్ నియామకంపై ప్రభుత్వం మెుగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.

అలాగే మరో సీనియర్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.  

ఇకపోతే ఐజీ  స్టీఫెన్ రవీంద్ర పేరు సైతం పరిశీలనలో ఉంది. స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ అధికారిగా కీలకమైన కేసులను ఛేదించారు. అంతేకాదు ప్రభుత్వ పెద్దలతో సైతం స్టీఫెన్ రవీంద్రకు మంచి సంబంధాలు ఉన్న సంగతి తెలిసిందే. 

డిప్యుటేషన్ పై ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సిన స్టీఫెన్ రవీంద్రకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో ఆయన ఇటీవలే తెలంగాణ పోలీస్ శాఖలో తిరిగి చేరాల్సి వచ్చింది. ఏపీలో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ గా నియమించుకోవాలని జగన్ ఆశించారు. అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కేంద్రంమాత్రం అంగీకరించకపోవడంతో ఆయన తెలంగాణకు పరిమితం కావాల్సి వచ్చింది.  

మరో సీనియర్ ఐపీఎస్ అధికారి ఐజీపీ శివధర్ రెడ్డి పేరు సైతం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివధర్ రెడ్డి ఇన్ స్పెక్టర్ జనరల్ పోలీస్ గా విధులు నిర్వహిస్తున్నారు. శివధర్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 
 

click me!