ఇకపై కేసీఆర్ కిట్ కాదు..: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం 

By Arun Kumar P  |  First Published Jan 5, 2024, 10:20 AM IST

తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. బిఆర్ఎస్ ప్రభుత్వ పథకాాల్లో కొన్నింటిని రద్దు చేస్తున్న ప్రభుత్వం మరికొన్నింటి పేరు మారుస్తోంది. 


హైదరాబాద్ : కేసీఆర్... తెలంగాణలో గత పదేళ్ళు బాగా వినిపించిన పేరిది. రాష్ట్ర ముఖ్యమంత్రి కావడమే కాదు కాదు పలు పథకాలు కేసీఆర్ పేరుతో అమలు కావడంతో ఆ పేరు బాగా వినిపించింది. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఓడించి కేసీఆర్ ను సైలెంట్ చేసిన కాంగ్రెస్ ఆయన పేరుకూడా కూడా రాష్ట్రంలో వినిపించకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ పేరుతో వున్న పథకాలను మారుస్తూ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 

గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం తల్లీబిడ్డల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్ పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ హాస్పిటల్స్ లో ప్రసవం జరిగితే ఆ బాలింత తల్లికి, నవజాత శిశువుకు ఉపయోగపడే వస్తువులను ప్రభుత్వమే ఉచితంగా అందించేది. పేద మద్యతరగతి తల్లులకు సాయం చేయాలనే ఉద్దేశ్యం బాగానే వున్నా కేసీఆర్ కిట్ అనే పేరు, ఆయన ఫోటోపై కాంగ్రెస్ ముందునుండి అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్ కిట్ పేరును మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 

Latest Videos

ఇకపై కేసీఆర్ కిట్ పేరును మదర్ ఆండ్ చైల్డ్ హెల్త్ (MCH) గా మారుస్తున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ పేరు, ఫోటోలతో కిట్ బ్యాగులపై ఎంసిహెచ్ స్టిక్కర్లు అతికించి పంపిణీ చేస్తున్నారు. ఇవన్నీ అయిపోయాక ఎంసిహెచ్ పేరుతో కొత్త కిట్లు అందించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు వైద్యారోగ్య సిబ్బంది చెబుతున్నారు. 

ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నివాసం కాస్త ఉపముఖ్యమంత్రి నివాసంగా... ప్రగతి భవన్ కాస్త ప్రజా భవన్ గా మారింది. అంతేకాదు అందులోనే ప్రతివారం ప్రజావాణి నిర్వహిస్తూ సామాన్యులను అనుమతిస్తున్నారు. ఇలా కేసీఆర్ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం అనుమతి లేని భవనంలోకి కాంగ్రెస్ సర్కార్ సామాన్యులను అనుమతిస్తోంది. 

ఇక సొంత స్థలాల్లో పేదల ఇళ్ల నిర్మాణం కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రకటించింది.  సొంతజాగాలో ఇళ్లనిర్మాణం కోసం అర్హులైనవారికి రూ.3 లక్షల ఆర్థికసాయం చేయడానికి తీసుకువచ్చిందే గృహలక్ష్మి. అయితే ఈ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసింది. ఆరుగ్యారంటీ హామీల్లో భాగంగా పేదల ఇళ్ళ నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తుంది... అందువల్లే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసినట్లు రేవంత్ సర్కార్ చెబుతోంది. 
 

click me!