ప్రపంచ అందాల పోటీకి ఐదేళ్ల చిన్నారి ఎంపిక...

By Arun Kumar PFirst Published Jan 4, 2019, 8:27 PM IST
Highlights

అంతర్జాతీయ స్థాయిలో అందాల పోటీకి తెలంగాణ బాలిక ఎంపికయ్యింది. 'వరల్డ్ రైజింగ్ స్టార్స్ 2019' పేరిట జరగనున్న పోటీలకు ఆన్ లైన్ లో జరిపిన ఎంపిక ప్రక్రియలో హైదరాబాద్ కు చెందిన యామిని ఎంపికయ్యింది. దేశవ్యాప్తంగా చాలా మంది చిన్నారులు పోటీ పడగా నిర్వహకులు యామినికి అవకాశం కల్పించారు. 

హైదరాబాద్ నగరంలో నివాసముంటున్న వెంకట్, జాహ్నవిల కూతురు పాటిపండ్ల యామిని. తమ పాప అందంగా, ముద్దులొలికేలా వుండటంతో తల్లిదండ్రులు ప్యాషన్ రంగంలోకి తీసుకెళ్లారు. కేవలం ఐదేళ్ల వయసులోనే యామిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 1వ తరగతి చదువుతూ...పలు ఫ్యాషన్ కంపెనీలకు బ్రాండ్ అబాసిడర్ గా వ్యవహరిస్తోంది. 

యామిని తల్లిదండ్రులు వరల్డ్ రైజింగ్ స్టార్స్ పోటీలన గురించి  తెలుసుకుని తమ పాపను అందులో పోటీకి నిలపాలనుకున్నారు. అందుకోసం మొదట నిర్వహకులు చేపట్టే ఆన్ లైన్ ప్రక్రియకు యామినిని సిద్దం చేశారు. ఇందులో మన దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల చిన్నారులు పాల్గొనగా చివరకు యామిని ఎంపికయ్యింది. 

ఈ నెల 08 నుండి 13 వరకూ జార్జియా దేశంలో జరగనున్న 'వరల్డ్ రైజింగ్ స్టర్స్ 2019' పోటీలకు భారత దేశం తరపున జూనియర్ విభాగంలో యామిని పాల్గొంటుంది. సుమారు 40 దేశాల మధ్య జరిగే పోటీలో యామిని గెలుపొందాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.  

click me!