తెలంగాణలో కరోనా వ్యాక్సిన్: గ్లోబల్ టెండర్లు పిలిచిన కేసీఆర్ సర్కార్

By narsimha lode  |  First Published May 19, 2021, 12:54 PM IST

రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు గ్లోబల్ టెండర్లు పిలిచింది. షార్ట్ టెండర్లను ప్రభుత్వం పిలిచింది. 


హైదరాబాద్: రాష్ట్రంలో వ్యాక్సిన్ డోసుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు గ్లోబల్ టెండర్లు పిలిచింది. షార్ట్ టెండర్లను ప్రభుత్వం పిలిచింది. ఈ నెల మొదటివారంలో కేబినెట్ సమావేశంలో  వ్యాక్సిన్ కొనుగోలు కోసం  గ్లోబల్ టెండర్లన పిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.  ఈ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ గ్లోబల్ టెండర్లు పిలిచింది. 

ఈ ఏడాది జూన్ 4వ తేదీ వరకు టెండర్లు దాఖలు చేయడానికి గడువును ప్రభుత్వం ఇచ్చింది.  ప్రతి నెలా 15 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు అందించాలని ఆ టెండర్ నోటీసులో పేర్కొన్నారు. రాష్ట్రంలో 4 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగానే  గ్లోబల్ టెండర్లను ప్రభుత్వంపిలిచింది. ఆరు మాసాల్లో  మొత్తం 10 మిలియన్ వ్యాక్సిన్ డోసులను ఇవ్వాలని ఈ టెండర్ నోటీసులో ప్రభుత్వం కోరింది.  భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను తప్పించిన తర్వాత వైద్య ఆరోగ్యశాఖను సీఎం తన వద్దే ఉంచుకొన్నారు. ఆరోగ్యశాఖ బాధ్యతలు తీసుకొన్న తర్వాత  కరోనా వ్యాక్సిన్ల కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

Latest Videos


 

click me!