ఏపీకి బదలాయించిన ఆ నిధులను ఇప్పించండి.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు హరీష్ రావు లేఖ..

By Sumanth KanukulaFirst Published Jan 22, 2023, 12:15 PM IST
Highlights

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన రూ. 495 కోట్ల సీఎస్ఎస్(సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీమ్) నిధులు తిరిగి ఇప్పించాలని కోరారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన రూ. 495 కోట్ల సీఎస్ఎస్(సెంటర్లీ స్పాన్సర్డ్ స్కీమ్) నిధులు తిరిగి ఇప్పించాలని మంత్రి హరీష్ రావు లేఖలో కోరారు. 2014-15లో సీఎస్‌ఎస్‌ కింద తెలంగాణకు హక్కుగా రావాల్సిన నగదును పొరపాటున ఆంధ్రప్రదేశ్‌లో ఖాతాలో జమచేశారని.. దీంతో తెలంగాణ నష్ట పోయిందని  పేర్కొన్నారు. 8 ఏళ్లు గడుస్తున్నా రూ. 495 కోట్లను తెలంగాణకు ఇంకా సర్దుబాటు చేయలేదని అన్నారు. ఆ నిధులను తిరిగి తెలంగాణకు ఇప్పించాలని లేఖలో పేర్కొన్నారు. 

ఈ విషయాన్ని తాము ఇప్పటికే కేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతోపాటు అకౌంటెంట్ జనరల్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఇప్పటికే తెలంగాణ తరుపున ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసిన స్పందన లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా స్పందించి సీఎస్ఎస్ నిధులు తెలంగాణకు తిరిగి ఇప్పించాలని కోరారు. 

click me!