కేసీఆర్ బీ-ఫారం సెంటిమెంట్... ఈసారి వర్కౌట్ అవుతుందా..?

By ramya neerukondaFirst Published Nov 12, 2018, 12:48 PM IST
Highlights

తెలంగాణలో ఎన్నికల నగారా మొదలైంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలో ఎన్నికల నగారా మొదలైంది. మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ ఒకవైపు మహాకూటమి మరోవైపు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయతే.. ఈ ఎన్నికల్లో కేసీఆర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే.. కేసీఆర్ కి దైవం, జ్యోతిష్యం, వాస్తులపై నమ్మకం ఎక్కువ. కోయినపల్లి ఆలయంలోని వెంకన్న పాదాల వద్ద తమ పార్టీ అభ్యర్థుల బీ-ఫారాలు ఉంచితే.. విజయం తమకే సొంతమౌతుందనే నమ్మకం కేసీఆర్ ది. గతంలో ఆయన పోటీచేసిన ప్రతిసారీ ఇదే జరిగింది.

అందుకే ఇదే సెంటిమెంట్ ని ఈసారి కూడా ఆయన అనుసరిస్తున్నారు. తమ పార్టీకి చెందిన 107మంది అభ్యర్థుల బీఫారాలను ఆయన స్వామివారి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. కాగా.. 1983నుంచి కేసీఆర్.. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.  తొలిసారిగా 1983లో టీడీపీ నుంచి సిద్ధిపేట అసెంబ్లీకి పోటీచేసిన ఆయన బీఫారాన్ని కోయినపల్లి వెంకన్న ఆలయంలో పూజలు చేయించారు.

గత 2014 ఎన్నికల్లోనూ ఈవిధంగానే పూజలు చేయించి విజయం సాధించారు.మరి ఈ సెంటిమెంట్ ఈ సారి కూడా వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే.. మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 

click me!