ప్రజా కూటమి సీఎంపీ ముసాయిదా ఖరారు: రేపు విడుదల

Published : Nov 12, 2018, 12:11 PM IST
ప్రజా కూటమి సీఎంపీ ముసాయిదా ఖరారు: రేపు విడుదల

సారాంశం

ప్రజా కూటమి(మహాకూటమి) కామన్ మినిమమ్ ప్రోగ్రాం ముసాయిదా ఖరారైంది. కూటమిలోని అన్ని పార్టీలు నవంబర్ 13 వ తేదీన సీఎంపీని విడుదల చేస్తారు.


హైదరాబాద్: ప్రజా కూటమి(మహాకూటమి) కామన్ మినిమమ్ ప్రోగ్రాం ముసాయిదా ఖరారైంది. కూటమిలోని అన్ని పార్టీలు నవంబర్ 13 వ తేదీన సీఎంపీని విడుదల చేస్తారు.

కాంగ్రెస్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసంలో సోమవారం నాడు కూటమి నేతలు సమావేశమయ్యారు. టీడీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ,  టీజేఎస్ చీఫ్ కోదండరామ్, ప్రజా యుద్దనౌక గద్దర్  తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్నందున  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి  ఈ సమావేశానికి హాజరుకాలేదు.

ముసాయిదా ప్రతి గురించి  ఈ మూడు పార్టీల నేతలు మరోసారి సోమవారం నాడు  చర్చించారు.ఈ సమావేశం నుండే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డికి ఫోన్ చేసి ముసాయిదా ప్రతి గురించి వివరించారు. ఈ ముసాయిదా పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కూడ సానుకూలంగా స్పందించారు.

తెలంగాణ ప్రజా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక  చేపట్టనున్న అంశాలనే  ముసాయిదాలో పొందుపర్చినట్టుగా కూటమి నేతలు ప్రకటించారు.  కూటమిలోని భాగస్వామ్య పక్షాలు  ఈ విషయమై ముసాయిదాను మంగళవారం నాడు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. సామాన్యులకు అనుకూలంగా ముసాయిదా ఉంటుందని  నేతలు చెప్పారు. ముసాయిదాను ప్రజల్లో విస్తతంగా ప్రచారం నిర్వహించనున్నట్టు  చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

శ్రీ సత్యసాయి ట్రస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరో విజయ్ దేవరకొండ | Asianet News Telugu
Vijay Deverakonda Superb Speech: విజయ్ దేవరకొండ స్పీచ్ కి సభ మొత్తం అరుపులే | Asianet News Telugu