TS Congress Govt :రేపే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం ?

Published : Dec 03, 2023, 05:47 PM ISTUpdated : Dec 05, 2023, 06:55 PM IST
TS Congress Govt :రేపే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం స్వీకారం ?

సారాంశం

TS Congress Govt : రేపు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం రాత్రికి సీఎల్పీ సమావేశం జరిగే అవకాశం ఉంది.

TS Congress Govt :తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌ (60)ను దాటింది. దీంతో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు వేగంగా సన్నహాకాలు చేస్తుంది. తొలుత డిసెంబర్ 9 వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు వార్తలు వచ్చినా.. ప్రభుత్వం ఏర్పాటుకు పూర్తి మెజార్టీ రావడంతో కాంగ్రెస్ సడెన్ గా వ్యూహం మార్చింది. రేపు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో  రాత్రి సీఎల్పీ సమావేశం జరిగే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు సమాచారం. రేపు ఉదయం కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలవనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్ లోని తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు.
 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?