DSC Notification: సంచలన నిర్ణయం.. డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. భారీ పోస్టులతో.. 

Published : Feb 28, 2024, 11:08 PM IST
DSC Notification: సంచలన నిర్ణయం.. డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు.. భారీ పోస్టులతో.. 

సారాంశం

DSC Notification:రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గత ఏడాది జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు (Dsc)చేసింది. అతి త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు పాఠశాల విద్య శాఖ వెల్లడింది. 

DSC Notification: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో జారీ చేసిన తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు (DSC) చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది.  ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తూ ‘కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్’ ఆదేశాలు జారీ చేశారు. అతి త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు పాఠశాల విద్య శాఖ వెల్లడింది. ఇప్పటికే 11,062 టీచర్‌ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దీనికి ఆర్థిక శాఖ అనుమతి కూడా లభించింది. కాగా.. గతంలో డీఎస్సీ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ స్పష్టం చేసింది. 

వాస్తవానికి రేపే (బుధవారం) నోటిఫికేషన్‌ ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావించినా పరీక్ష షెడ్యూల్‌,సాఫ్ట్‌వేర్‌ అప్డేట్ వంటి పలు మార్పులు చేయాల్సి ఉంది. దీంతో నోటిఫికేషన్ విడుదలకు ఒకట్రెండు రోజులు ఆలస్యమయ్యే అవకాశముంది. గతేడాది జారీ చేసిన 5,089 పోస్టులతో పాటు అదనంగా కొత్త పోస్టులు కలుపుకొని డీఎస్సీ నిర్వహించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్యశాఖ పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కాగా గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాఫ్ట్‌వేర్‌ అప్డేట్ చేయనున్నది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్