‘రుణ‘ తెలంగాణం.. అభివృద్దికి సోపానం

Published : Mar 13, 2017, 01:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
‘రుణ‘ తెలంగాణం.. అభివృద్దికి సోపానం

సారాంశం

మూడేళ్లకే రెట్టింపైన తెలంగాణ అప్పులు

బంగార తెలంగాణ నిర్మించాలంటే కోట్ల నిధులు కావాలి. అందుకు అప్పు చేయాలి. ఆ అప్పుకు వడ్డీ కట్టేందుకు మళ్లీ అప్పు చేయాలి. అప్పుతోనే అభివృద్ధి సాధ్యమని గత పాలకులు భావించిన రీతిలోనే, దారిలోనే తెలంగాణ ప్రభుత్వం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. దీనికి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అప్పులే నిదర్శనం.

 

రాష్ట్ర విభజన నాటికి సమైక్య రాష్ట్రం మొత్తం రుణభారం ఒక లక్షా 66 వేల కోట్లు. అందులో 18 వేల కోట్ల రూపాయల అప్పు మీద వివాదాలు ఉన్నాయి. రూ. 1,48,060 కోట్ల అప్పును రెండు రాష్ట్రలు పంచుకోగా అందులో తెలంగాణ వాటాగా రూ.61,711 కోట్ల అప్పు మిగిలింది.

 

ఇది తీర్చకుండానే తెలంగాణ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ నాటికి రూ.22,134 కోట్లు అప్పు చేసింది, రెండో బడ్జెట్‌ నాటికి రూ.38,996 కోట్లు, మూడో బడ్జెట్‌ నాటికి రూ.62,110 కోట్లుకు అప్పు పెరిగింది. అంటే మూడు సంవత్సరాలు నిండకుండానే మన తెలంగాణ అప్పు రెట్టింపు అయిందని తెలిస్తోంది.

 

ఈ రోజు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా ఆర్థిక మంత్రి ఈటెల రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ప్రకటన చేశారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం మొత్తం అప్పు రూ.1,40,523కోట్లు ఉందని వెల్లడించారు.  దీనికి అదనంగా కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇతర మార్గాల ద్వారా రూ.26,400 కోట్లను రుణంగా తీసుకోనున్నట్లు తెలిపారు.

 

అంటే మూడున్నరేళ్లలోనే తెలంగాణ ప్రభుత్వ అప్పులు 22, 134 కోట్ల నుంచి 1,40,523 కోట్లుకు రికార్డు స్థాయిలో పెరిగాయని అర్థం చేసుకోవచ్చు.

 

PREV
click me!

Recommended Stories

KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu
KCR Press Meet: ఇప్పటి వరకు ఒక లెక్క రేపటి నుంచి మరో లెక్క: కేసీఆర్| Asianet News Telugu