కేసీఆర్ కి ఓటమి భయం.. ప్రజలకు కూడా బెదిరింపులు.. విజయశాంతి

By telugu news teamFirst Published Dec 29, 2020, 10:01 AM IST
Highlights

రైతు కొనుగోలు కేంద్రాలు ఏత్తేస్తామన్న ప్రభుత్వం అంటోందని.. రేపు పెన్షన్లు కూడా ఇవ్వలేమని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేమని చేతులు దులుపుకునే అవకాశం ఉందని ఆరోపించారు

సీఎం కేసీఆర్ కి ఓటమి భయం పట్టుకుందని.. ఆ భయంతోనే ప్రజలను సైతం బెదిరిస్తున్నారంటూ బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. రైతు కొనుగోలు కేంద్రాలు ఏత్తేస్తామన్న ప్రభుత్వం అంటోందని.. రేపు పెన్షన్లు కూడా ఇవ్వలేమని.. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేమని చేతులు దులుపుకునే అవకాశం ఉందని ఆరోపించారు. అందుకు ఇటీవల టీఆర్ఎస్ మంత్రులు చేస్తున్న ప్రకటనలే నిదర్శనమని చెప్పారు.

‘‘ముఖ్యమంత్రి గారు ఓటమి అయోమయంలో, కేసులు భయంలో చివరికి ప్రజలను కూడా బెదిరించే స్ధాయికి దిగి వ్యవహరిస్తున్నారు.ఈ రోజు రైతు కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తాం, 7500 కోట్ల నష్టం వస్తుంది అంటున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వం, రేపు 4 లక్షల కోట్లు అప్పులు వలన పెన్షన్లు ఇవ్వలేము, డబుల్ బెడ్రూంలు కట్టలేము అని చేతులు దులుపుకునే అవకాశం ఉంది. కొంతమంది టీఆర్ఎస్ మంత్రులు ఇటీవల ప్రకటనలు ఇందుకు దారితీసే విధంగా కనుబడుతున్నాయి. దళితుల 3 ఎకరాల భూమి తుంగలోనే తొక్కినట్టే ఇవి కూడా జరగవచ్చు.. కాని, తెలంగాణ సమాజం తిరుగుబాటుకు సిద్ధమయ్యింది. పరిణామాలు త్రీవంగా ఉండబోతున్నాయని ఈ పరిపాలకులు అర్థం చేసుకోకపోవడం వారి మూర్ఖత్వం. మీరు కొనుగోలు కేంద్రాలు తీసేస్తే రైతులు మీ తోళ్ళు, గోళ్ళూ తీసే పరిస్థితులు ఉంటాయేమో విశ్లేషించుకోవాలి’’ అని విజయశాంతి పేర్కొన్నారు.
 

click me!