తెలంగాణలో కొత్తగా 627 కరోనా కేసులు.. 4 మరణాలు..

Published : Dec 19, 2020, 10:27 AM IST
తెలంగాణలో కొత్తగా 627 కరోనా కేసులు.. 4 మరణాలు..

సారాంశం

తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. నిన్న కొత్తగా 627 కరోనా కేసులు బయట పడ్డాయి. తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 46, 694 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

తెలంగాణలో మళ్లీ కరోనా విజృంభిస్తుంది. నిన్న కొత్తగా 627 కరోనా కేసులు బయట పడ్డాయి. తెలంగాణలో నిన్న రాత్రి 8 గంటల వరకు 46, 694 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 627 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,80,822కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో నలుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,510కి చేరింది.

కరోనాబారినుంచి నిన్న 721 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,72,370కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 6,942 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 4, 814 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగానలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 64,01,082కి చేరింది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
అసలేంటీ జీవో 97.. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? దీంతో ఏం జ‌రుగుతుంది?