ఇక నుండి వార్ రూమ్ నుండే వ్యూహాలు అమలు:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దూకుడు

By narsimha lode  |  First Published Sep 27, 2023, 1:49 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నద్దమౌతుంది.  హైద్రాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ ను ఏర్పాటు చేస్తుంది. ఈ వార్ రూమ్ ఎన్నికల్లో కీలకంగా మారనుంది.
 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ కసరత్తును మరింత ముమ్మరం చేసింది. హైద్రాబాద్ గాంధీ భవన్ లో వార్ రూమ్ ను బుధవారంనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించనుంది. ఈ వార్ రూమ్ నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన క్షేత్రస్థాయి క్యాడర్ కు సమాచారం చేరనుంది. ఏ ప్రాంతంలో ఏ రకమైన పరిస్థితి ఉంది...ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్లాలనే విషయాలపై  పార్టీ క్యాడర్ కు దిశా నిర్ధేశం చేయనున్నారు.  అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలు  టీమ్ సర్వే రిపోర్టులను కూడ పార్టీ అభ్యర్థులకు ఎప్పటికప్పుడు అందించనుంది. ఏ ప్రాంతంలో ఏ నేత ప్రచారం చేస్తే పార్టీకి ప్రయోజనం... ఎవరిని ఎక్కడ ప్రచారంలోకి దింపాలనే విషయాలను కూడ వార్ రూమ్ నుండి కింది స్థాయి  క్యాడర్ కు  దిశా నిర్ధేశం చేయనున్నారు.

బూత్ స్థాయిలో ఏ రకమైన పరిస్థితి ఉందోననే విషయాలను కూడ  కాంగ్రెస్ క్యాడర్ కు  వార్ రూమ్ నుండి  సమాచారం చేరనుంది.  ఎన్నికలకు ఈ వార్ రూమ్ కీలకంగా పనిచేయనుంది.  ఇప్పటికే  అభ్యర్ధుల ఎంపికపై  కాంగ్రెస్ నాయకత్వం సమావేశాలు నిర్వహించింది. వచ్చే నెల మొదటి వారంలో  అభ్యర్ధుల జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

Latest Videos

undefined

also read:40కిపైగా అసెంబ్లీ సీట్లకు పట్టు:ఢిల్లీకి వెళ్లిన కాంగ్రెస్‌ బీసీ నేతలు

అంతేకాదు నియోజకవర్గాలకు పంపాల్సిన ఎన్నికల మెటీరియల్, ప్రత్యర్ధులకు వ్యతిరేకంగా చేయాల్సిన ప్రచారం వంటి వాటిని కూడ వార్ రూమ్ నుండి  కాంగ్రెస్ క్యాడర్ కు సమాచారం అందించనున్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు వార్ రూమ్ కీలకంగా పనిచేస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యర్ధుల ప్రచారం ఎలా ఉంది...కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలనే విషయాలపై  కూడ  దిశాని నిర్ధేశం చేయనున్నారు. క్షేత్ర స్థాయి కార్యకర్తలు కూడ వార్ రూమ్ తో నేరుగా  సంప్రదింపులు జరిపేందుకు కూడ వెసులుబాటు  ఉంది.అదే సమయంలో క్షేత్రస్థాయి క్యాడర్ నుండి సమాచారాన్ని కూడ  వార్ రూమ్ నేరుగా తీసుకొనే అవకాశం ఉంది. 

click me!