వరంగల్ రాహుల్ సభతో జోష్: ఈ నెల 21 నుండి పల్లె పల్లెకు కాంగ్రెస్

By narsimha lodeFirst Published May 12, 2022, 10:55 AM IST
Highlights


వరంగల్ డిక్లరేషన్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తుంది.ఈ మేరకు పల్లె పల్లెకు కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాని టీపీసీసీ భావిస్తుంది.ఈ నెల 21 నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ తల పెట్టింది.


హైదరాబాద్: Warangal లో Rahul Gandhi  సభ విజయవంతం కావడంతో అదే ఊపును కొనసాగించాలని  Telangana Congress పార్టీ నాయకత్వం భావిస్తుంది. ఈ నెల 6వ తేదీన వరంగల్ లో రైతు సంఘర్షణ సభ పేరుతో కాంగ్రెస్ పార్టీ సభను ఏర్పాటు చేసింది.ఈ సభలో కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పాల్గొన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారనే విషయాన్ని కూడా రాహుల్ గాంధీ వివరించారు. warangal congress declaration ను తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలని కూడా  కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రైతు డిక్లరేషన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయనుంది. ఈ విషయమై కార్యాచరణను నిర్ణయించేందుకు గాను ఈ నెల 16న కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశంలో palle palleku congress, అనే కార్యక్రమానికి సంబంధించి కార్యాచరణను  ఫైనల్ చేయనున్నారు.

పల్లె పల్లెకు కాంగ్రెస్ పేరుతో గ్రామాల్లో 300 మంది నేతలు ప్రచారం చేయనున్నారు. ప్రతి నాయకుడికి 30 గ్రామాల బాధ్యతను అప్పగించే అవకాశం ఉంది.  నెల రోజుల పాటు  గ్రామాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నెల 21వ తేదీ నుండి పల్లె పల్లెకు కార్యక్రమాన్ని ప్రారంభించాలని TPCC  నాయకత్వం భావిస్తుంది. 

రాహుల్ గాంధీ వరంగల్ టూర్  తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది.. గత కొంత కాలంలో కాంగ్రెస్ శ్రేణుల్లో నిరుత్సాహం ఈ సభతో పోయిందని ఆ పార్టీ నాయకత్వం చెబుతుంది.  వరంగల్ సభ జరిగిన మరునాడు హైద్రాబాద్ లో పార్టీ నేతలకు రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు నాయకులు తమ మధ్య విబేధాలను విడనాడాలని కూడా రాహుల్ కోరారు. ఏదైనా ఇబ్బందులు ఉంటే పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకు రావాలని కూడా రాహుల్ సూచించారు. మీడియాకు పార్టీ అంతర్గత విషయాలు మాట్లాడొద్దని కూడా రాహుల్ గాంధీ సూచించారు.

పార్టీ నేతలు హైద్రాబాద్ ను వదిలి  గ్రామాలకు వెళ్లాలని కూడా రాహుల్ గాంధీ సూచించారు. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు పని చేయాలని రాహుల్ గాంధీ కోరారు. ఎంత పెద్ద నేత అయినా కూడా పనితీరు ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్ కేటాయిస్తామని కూడా రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీకి వచ్చి ఫైరవీ చేస్తేనో హైద్రాబాద్ లో ఉంటూ పార్టీ నాయకత్వాన్ని ప్రసన్నం చేసుకొంటే టికెట్లు రావని కూడా రాహుల్ తేల్చేశారు. దీంతో పల్లె పల్లెకు కాంగ్రెస్ నాయకత్వాన్ని పార్టీ నాయకులు సీరియస్ గా తీసుకొనే అవకాశం ఉంది.

మరో వైపు వరంగల్ సభపై కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహాకర్త సునీల్  రాహుల్ గాంధీకి నివేదికను అందించారు. ఈ సభకు ఏ నాయకుడు ఎంత మందిని జనాన్ని సమీకరించారనే విషయాలతో పాటు సభలో ఎవరి ప్రసంగానికి ఎలాంటి రెస్పాన్స్ ఉందనే విషయాలపై కూడా సునీల్ టీమ్  పార్టీ నాయకత్వానికి నివేదికను ఇచ్చింది. రాహుల్ గాంధీ ప్రసంగించే సమయంలో  ప్రజల నుండి ఏ విషయాలకు పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చిందనే విషయాలపై కూడా  సునీల్ ీమ్ నివేదికను  అందించింది.

click me!