Congress: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరే.. హైకమండ్ కు షార్ట్ లిస్ట్ ..

By Rajesh Karampoori  |  First Published Feb 7, 2024, 6:28 AM IST

Telangana Congress: పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు 17 స్థానాలకు కాంగ్రెస్‌ నేతలు 309 మంది దరఖాస్తు చేసుకోగా వీటికి సంబంధించి నియోజకవర్గాల వారీగా ఇద్దరు లేదా ముగ్గురు ప్రధాన నేతలను పరిశీలన చేసి, అర్హులైన వారిని స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేసింది. షార్ట్ లిస్ట్ లోని అభ్యర్థులు వీరే.  


Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడించి మంచి జోష్ మీద ఉన్నా కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించగా పార్టీ .. గెలుపు గుర్రాల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తుంది. 17 లోక్‌సభ స్థానాల నుంచి మొత్తం 309 మంది నాయకులు అర్జీ పెట్టుకున్నారు. ఇందులో పార్టీ నాయకులతో పాటు అధికారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.

ఈ నేపథ్యంలో ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్‌మున్సి, స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ హరీశ్ చౌదరి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఎన్. ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్‌లో ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. దరఖాస్తుల పరిశీలనను స్క్రీనింగ్ కమిటీ చేసింది. 

Latest Videos

undefined

గత నెల 31 నుండి ఫిబ్రవరి 3 వరకు రాష్ట్రంలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించగా.. మొత్తం 309 మంది దరఖాస్తు చేసుకున్నారు.  సాధారణ నియోజకవర్గాల కంటే ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలకు టిక్కెట్ల కోసం విపరీతమైన డిమాండ్ ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎస్టీ రిజర్వ్‌డ్ సీటుగా ఉన్న మహబూబాబాద్‌లో అత్యధికంగా 48, వరంగల్‌లో ఎస్సీ రిజర్వ్‌డ్ సీటుకు 42 దరఖాస్తులు వచ్చాయి. 20కి పైగా దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో పెద్దపల్లి (ఎస్సీ రిజర్వ్‌డ్), 29, భువనగిరి (28), ఎస్సీ రిజర్వ్‌డ్ నాగర్‌కర్నూల్ (26), ఎస్టీ రిజర్వ్‌డ్ ఆదిలాబాద్ (22) ఉన్నాయి. ఇక మెదక్ (11), మల్కాజిగిరి (11), హైదరాబాద్ (11), చేవెళ్ల (12), కరీంనగర్ (14), సికింద్రాబాద్ (16) నియోజకవర్గాలకు దరఖాస్తులు వచ్చాయి.అతి తక్కువ దరఖాస్తులు వచ్చిన నియోజకవర్గాల్లో మహబూబ్‌నగర్‌ (4), జహీరాబాద్( 6)మాత్రమే దరఖాస్తు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

ఈ నేపథ్యంలో  స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది.  ప్రతి నియోజకవర్గం నుండి ముగ్గురి పేర్లను పార్టీ హైకమాండ్‌కు సిఫార్సు చేస్తుంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రాకముందే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించాలని హైకమాండ్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. భారత ఎన్నికల సంఘం ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

స్క్రీనింగ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల జాబితా ఇదే.. 

17 నియోజక వర్గాలు.. షార్ట్ లిస్ట్ లోని  అభ్యర్థులు 

1. ఆదిలాబాద్ = రేఖ నాయక్, నరేశ్‌ జాదవ్, రాథోడ్ ప్రకాశ్,

2. పెద్దపల్లి= సుగుణ కుమారి, గడ్డం వంశీ, వెంకటేష్ నేత

3. కరీంనగర్ = ప్రవీణ్ కుమార్, వీ. రాజేందర్ రావు, రుద్ర సంతోష్ 

4. వరంగల్=  అద్దంకి దయాకర్, సిరిసిల్ల రాజయ్య, డీ. సాంబయ్య

5. నిజామాబాద్ = ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, అరికెల నర్సారెడ్డి,  మోహన్ రెడ్డి 

6. జహీరాబాద్ = సురేష్ షట్కర్, ఉజ్వల్ రెడ్డి

7. మెదక్ = ఎం.భవానీరెడ్డి, మైనంపల్లి హనుమంత రావు, జగ్గారెడ్డి  

8. చేవెళ్ల = చిగురింత పారిజాతారెడ్డి, కిచెన్నగారి లక్ష్మారెడ్డి, దామోదర్ ( అధికార ప్రతినిధి)

9. మల్కాజిగిరి = సినీ నిర్మాత బండ్ల గణేష్, ఏ. కొండల్ రెడ్డి, సర్వే సత్యనారాయణ 

10. మహబూబాబాద్ =  వంశీ చందర్ రెడ్డి, మన్నె జీవన్ రెడ్డి, జిల్లెల ఆదిత్య రెడ్డి,  

11. నాగర్‌కర్నూల్=  మల్లు రవి, చారకొండ వెంకటేష్, సంపత్‌కుమార్, 

12. నల్గొండ= పటేల్ రమేష్ రెడ్డి, రఘువీర్‌రెడ్డి, జానా రెడ్డి, 

13. భువనగిరి= చామల కిరణ్‌రెడ్డి, కొమటిరెడ్డి పవన్‌రెడ్డి, శివసేన రెడ్డి

14. మహబూబ్‌నగర్= బలరాం నాయక్, బెల్లయ్యనాయక్, నాగరాజ్,  

15. ఖమ్మం= మల్లు నందిని, రేణుకాచౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, 

16. సికింద్రాబాద్ = అనిల్‌కుమార్ యాదవ్, రోహిత్ రెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి, 

17. హైదరాబాద్=  ఫిరోజ్‌ఖాన్, సునిత రావు, సమీర్ ఎల్లా, 
 

click me!