రేవంత్ రెడ్డికి జగ్గారెడ్డి పరోక్ష షాక్ లు: రామేశ్వర రావుకు మద్దతు

By telugu teamFirst Published Mar 3, 2020, 6:38 PM IST
Highlights

రామేశ్వర రావుపై తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కాంగ్రెసు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరోక్షంగా వ్యతిరేకించారు. రామేశ్వర రావుకు మద్దతుగా ఆయన మాట్లాడారు.

హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త రామేశ్వర రావుపై తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కాంగ్రెసు సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి పరోక్షంగా తప్పుపట్టారు. అదే సమయంలో రామేశ్వర రావుకు మద్దతు ఇచ్చారు. రేవంత్ రెడ్డికి పరోక్షంగా చురకలు అంటించారు.

రామేశ్వర రావు వ్యాపారవేత్త అని, ఆయన భూముల అంశం తెలియదని, వ్యాపారవేత్తలు ప్రభుత్వ సహకారం కోరితే ప్రోత్సహించవచ్చునని, ప్రభుత్వాలను తప్పు పట్టడం సరికాదని జగ్గారెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా రేవంత్ రెడ్డిని ఆయన తప్పు పడుతూ రామేశ్వర రావుకు మద్దతుగా నిలిచారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం తీరుతో రైతులు విసిగిపోయారని ఆయన అన్నారు. రైతులను బానిసలుగా మార్చే పరిస్థితి వచ్చిందని, మెజారిటీ రైతులకు రైతు బంధు రాలేదని ఆయన అన్నారు. పంట నష్టపోయిన రైతులను ఇప్పటి వరకు ఆదుకోలేదని అన్నారు. 

వచ్చే ఎన్నికల వరకు ఉత్తమ్ కుమార్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కొనసాగించాలని, పైరవీ చేసుకుంటే పీసీసీ పదవి రాదని జగ్గారెడ్డి అన్నారు. పైరవీదారులకు పీసీసీ ఇస్తే పార్టీ దెబ్బ తింటుందని ఆయన అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరి పేరు చెప్తే వారు పీసీసీ చీఫ్ అవుతారనేది వాస్తవమని అన్నారు. జానారెడ్ిడ, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి పీసీసీ రేసులో ఉన్నట్లు ఆయన తెలిపారు 

ఫిరాయింపుల విషయంలో ఏ పార్టీకి కూడా నైతిక విలువలు లేవని, ఈ విషయంపై తమ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా తప్పేనని జగ్గారెడ్డి అన్నారు. రాహుల్ ఏఐసీసి పగ్లాలు చేపట్టి దేశవ్యాప్తంగా పర్యటించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

click me!