ఈ నెల 25 నుంచి పాదయాత్ర!.. రాష్ట్రమంతా చేస్తా: కాంగ్రెస్ నేత భట్టి

Published : Mar 18, 2022, 04:52 PM ISTUpdated : Mar 18, 2022, 04:58 PM IST
ఈ నెల 25 నుంచి పాదయాత్ర!.. రాష్ట్రమంతా చేస్తా: కాంగ్రెస్ నేత భట్టి

సారాంశం

కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్రమంతా పాదయాత్ర చేపడతానని వివరించారు. ఈ నెల 25వ తేదీ నుంచి తన పాదయాత్ర ప్రారంభం కావొచ్చని తెలిపారు. ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉండాలని ఈ పాదయాత్ర చేస్తున్నట్టు వివరించారు.  

హైదరాబాద్: కాంగ్రెస్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కీలక విషయాలు వెల్లడించారు. తాను మళ్లీ తన పాదయాత్రను ఈ నెల 25వ తేదీ నుంచి మొదలు పెట్టే యోచనలో ఉన్నట్టు వివరించారు. నియోజకవర్గ నేతలతో మాట్లాడి కన్ఫామ్ చేసి ప్రకటిస్తామని తెలిపారు. తాను రాష్ట్రమంతటా పాదయాత్ర చేస్తానని పేర్కొన్నారు. ప్రతి మండలాన్ని కలుపుతూ తన పాదయాత్ర సాగుతుందని వివరించారు.

రాష్ట్రమంతటా పాదయాత్ర చేపట్టడానికి అధిష్టానం నుంచి అనుమతి తీసుకున్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తనకు సీఎల్పీ ఉద్యోగం ఇచ్చినప్పుడే ఈ విషయం వారు చెప్పారని, గాంధీ భవన్‌కు పరిమితం కావొద్దని, ప్రజల్లోకి వెళ్లాలని, వారితో నేరుగా కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పారని వివరించారు. కాబట్టి, తనకు అడ్డంకులేమీ లేవని, రాష్ట్రమంతా పాదయాత్ర చేపడుతానని చెప్పారు.

అదే సందర్భంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై విమర్శలు చేశారు. భట్టి విక్రమార్క్ పార్లమెంటుకు టీఆర్ఎస్ టికెట్‌పై వెళతారా? కాంగ్రెస్ టికెట్‌పై వెళతారా? అని చేసిన వ్యాఖ్యల పై స్పందిస్తూ.. తాను వంద పార్టీలు తిరగలేదని కౌంటర్ ఇచ్చారు. భట్టి అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే భట్టి అని పేర్కొన్నారు. పార్లమెంటుకు వెళితే కాంగ్రెస్ టికెట్‌పైనే వెళతానని స్పష్టం చేశారు. అంటే.. మదిర వదిలి పార్లమెంటుకు వెళ్లే ఆలోచనల్లో ఉన్నారా?అని అడగ్గా.. అలాంటి ఆలోచనలు లేవని వివరించారు. తనను ఎన్నుకున్న మదిరకు మరెన్నో సేవలు చేయాల్సి ఉన్నదని చెప్పారు.

టీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎక్కడా కలిసి లేవని ఆయన స్పష్టం చేశారు. కానీ, టీఆర్ఎస్, బీజేపీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉన్నదని ఆరోపించారు. జీఎస్టీ, రాష్ట్రపతి ఎన్నికలు, ఇతర మరెన్నో అవసరాలకు బీజేపీకి అనుకూలంగా టీఆర్ఎస్ ఓటు వేసిందని వివరించారు.

ఇది ఇలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమాను వ్యక్తం చేశారు.బుధవారం నాడు Hyderabad లో సమావేశం జరిగింది.ఈ సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వాలను సమర్ధిస్తూ సీఎల్పీ సమావేశం తీర్మానం చేసింది. 

పార్టీని కాపాడేందుకు Sonia Gandhi తీసుకొన్న నిర్ణయాన్ని  ఆహ్వానిస్తున్నామని సీఎల్పీ నేత Mallu Bhatti Vikramaraka చెప్పారు. Congress భావజాలాన్ని కాపాడేందుకు త్యాగాలు చేసిన కుటుంబం గాంధీలదని భట్టి విక్రమార్క చెప్పారు. గాంధీ ఫ్యామిలీ త్యాగాతోనే Kapil Sibal కేంద్రంలో మంత్రిగా పనిచేశారని మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.సీనియర్ నేతల సమావేశం రాహుల్ నాయకత్వంకోసమేనని ఆయన చెప్పారు.

మతతత్వ వాదనతో జాతి విచ్చిన్నం కుట్ర జరుగుతుంది. వీటిపై పోరాటానికి Rahul gandhi పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క చెప్పారు. దేశ రక్షణ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతలను చేపట్టాలని కూడా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కోరారు.  ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పై కపిల్ సిబల్  స్పంందిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి గాంధీ కుటుంబం తప్పుకోవాలని కోరారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే
Medak Cathedral – Asia’s 2nd Largest Gothic Church Near Hyderabad | Story | Asianet News Telugu