Telangana: టీఆర్ఎస్ హయాంలో ముస్లింలకు అన్యాయం జ‌రుగుతోంది..

Published : Mar 18, 2022, 04:38 PM IST
Telangana: టీఆర్ఎస్ హయాంలో ముస్లింలకు అన్యాయం జ‌రుగుతోంది..

సారాంశం

Telangana: ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెరాస ప్ర‌భుత్వం రాష్ట్రంలో ముస్లింల‌కు అన్యాయం చేస్తున్న‌ద‌ని మాజీ పార్ల‌మెంట్ స‌భ్యులు ఆరోపించారు. బ‌డ్జెట్ కేటాయింపులు సైతం చాలా త‌క్కువ‌గా ఉంటున్నాయ‌ని పేర్కొన్నారు.   

Telangana: టీఆర్‌ఎస్‌ హయాంలో ముస్లింలకు అన్యాయం జరుగుతోందని పార్లమెంట్‌ మాజీ సభ్యుడు (senior leader of Communist Party of India-CPI) సయ్యద్‌ అజీజ్‌ పాషా ఆరోపించారు. రాష్ట్రంలో ముస్లిం జనాభా 20 శాతం ఉండగా ప్రభుత్వం మైనారిటీ సంక్షేమానికి బడ్జెట్‌లో కేవలం 0.12 శాతం మాత్రమే కేటాయించింది. ముస్లిం జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం బడ్జెట్‌ను కేటాయించాలని ఆయన అన్నారు.

టీఆర్‌ఎస్‌ హయాంలో ఆక్వాఫ్‌ ఆస్తులు అక్రమంగా కబ్జాలకు గురవుతున్నాయని స‌య్య‌ద్ అజీజ్ పాషా ఆరోపించారు. దర్గా హుస్సేన్ షా వలీ వక్ఫ్ భూములను ప్రభుత్వం తన సొంతమని సుప్రీం కోర్టులో చూపించి కేసు గెలిచాడు. మదీనా ఎడ్యుకేషన్‌ సెంటర్‌ హాలులో గురువారం జరిగిన తెలంగాణ మైనారిటీల హక్కుల పరిరక్షణ వేదిక సమావేశంలో పాషా (Syed Aziz Pasha)మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు ఐక్యంగా ఉద్యమించాలని ఆయ‌న పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర నగర సంఘాల ప్రముఖులు హాజరయ్యారు.

ప్ర‌స్తుతం ప‌రిస్థితులు గ‌మ‌నిస్తే రాష్ట్రంలోని అన్ని ప్ర‌తిపక్ష పార్టీలు అధికార పార్టీ టీఆర్ఎస్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే అన్ని పార్టీల నాయ‌కులు ప్ర‌భుత్వం విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డుతున్నారు. ఇక కాంగ్రెస్‌, బీజేపీలు అధికార టీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నిక‌ల్లే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. 

దూకుడుగా ఉన్న బీజేపీ.. రాష్ట్ర ప్ర‌భుత్వంపై మ‌రింత‌గా రెచ్చిపోతూ.. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును ఓటమి నుంచి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా రక్షించలేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేంద‌ర్ అన్నారు. కేసీఆర్ బహిరంగ చర్చకు రావాలని ఆయ‌న సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడంతోపాటు హైకోర్టు ఆదేశాలిచ్చినా సస్పెన్షన్‌ను రద్దు చేయకపోవడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌లో జరిగిన సభలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ కాషాయ జెండా రెపరెపలాడుతుందని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు. కేసీఆర్ కుట్రపూరితంగా త‌న‌ను పార్టీ నుంచి తప్పించారని, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు శాయశక్తులా ప్రయత్నించారని అన్నారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు, కుట్ర‌లు ప‌న్నినా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ఓట‌మి ఖాయ‌మ‌ని అన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai Fire on Media: మీడియా పైరెచ్చిపోయిన రేణు దేశాయ్ | Asianet News Telugu
Renu Desai Strong Comments On Street Dogs: కుక్కల మరణాలపై రేణు దేశాయ్ ఉగ్రరూపం | Asianet News Telugu