
తెలంగాణలో హైదరాబాద్ (hyderabad) తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌పై (warangal) రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా అక్కడ కూడా పెట్టుబడులు పెట్టేందుకు కావాల్సిన వాతావరణాన్ని సృష్టిస్తోంది. ఇప్పటకే కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (kakatiya mega textile park) నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనితో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కూడా ప్రాధాన్యమిస్తోంది. దీనిలో భాగంగా వరంగల్‌లో రింగ్ రోడ్ (warangal ring road) నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ (congress) వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ (manickam tagore) ట్వీట్ చేశారు. కొడుకు మంత్రి కొత్త ప్లాన్ అని.. రియల్ ఎస్టేట్ మాఫియా నుంచి ఆదాయం కోసమే ఈ ప్లాన్ వేశారని ఠాగూర్ ఆరోపించారు. రింగు రోడ్డు కోసం 27 వేల ఎకరాలు సేకరిస్తున్నారని మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు.
ఇదే వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) , మున్సిపల్ మంత్రి కేటీఆర్‌పై (ktr) తీవ్ర ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) . తమ రియల్ ఎస్టేట్ మాఫియాతో మరో భారీ దోపిడీకి స్కెచ్ వేశారని ఆయన ఆరోపణలు గుప్పించారు. వరంగల్ రింగ్ రోడ్డు (WRR) పేరుతో దోపిడీకి సిద్ధమయ్యారని రేవంత్ ఆరోపించారు. తన రియల్ ఎస్టేట్ మాఫియా ద్వారా విలువైన పంటలు పండే భూములు లాక్కునేందుకు సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్లాన్ చేశారని ఆయన ఎద్దేవా చేశారు. రింగ్ రోడ్డుకి భూసేకరణ పేరుతో రైతుల నుంచి భూములు గుంజుకోనున్నారని రేవంత్ ఆరోపించారు. ఇప్పటికే గులాబీ దండు ఆ చుట్టుపక్కల అతి తక్కువ ధరకు భారీగా భూములు కొనుగోలు చేసిందంటూ ఆయన సంచలన ట్వీట్ చేశారు.