కరోనా దెబ్బ: తెలంగాణలో డిగ్రీ ఆఢ్మిషన్స్ ప్రక్రియ వాయిదా

By narsimha lode  |  First Published Jul 1, 2020, 2:24 PM IST

: కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ లో డిగ్రీ ఆడ్మిషన్లను తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు వాయిదా వేసింది. ఇవాళ్టి నుండి ఆన్ లైన్ లో డిగ్రీ ఆడ్మిషన్స్ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది.



హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్ లో డిగ్రీ ఆడ్మిషన్లను తెలంగాణ ప్రభుత్వం బుధవారం నాడు వాయిదా వేసింది. ఇవాళ్టి నుండి ఆన్ లైన్ లో డిగ్రీ ఆడ్మిషన్స్ ప్రక్రియను ప్రారంభించాల్సి ఉంది.

కరోనా కేసులు పెరిగిపోవడంతో ఈ ఆడ్మిషన్స్ ను వాయిదా వేసింది ప్రభుత్వం. 15 రోజులపాటు ఈ ఆడ్మిషన్స్ ప్రక్రియను వాయిదా వేసినట్టుగా ప్రభుత్వం తెలిపింది.   దోస్త్-2020 మొదటి విడత రిజిస్ట్రేషన్  ప్రక్రియన ఇవాళ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కరోనాను పురస్కరించుకొని ఈ ప్రక్రియను వాయిదా వేసినట్టుగా దోస్త్ వెబ్ సైట్ ప్రకటించింది.

Latest Videos

undefined

also read:తెలంగాణలో ఎంసెట్ సహా ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా

తెలంగాణ రాష్ట్రంలోని ఆరు వేర్వేరు యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న కాలేజీల్లో ఆడ్మిషన్లకు దోస్త్ వెబ్ సైట్ అనుసంధానంగా పనిచేయనుంది.

రాష్ట్రంలోని కాకతీయ, మహాత్మాగాంధీ, ఉస్మానియా, పాలమూరు, శాతవాహన, తెలంగాణ యూనివర్శిటీలకు అనుబంధంగా ఉన్న కాలేజీల్లో ఆడ్మిషన్ల కొరకు దోస్త్ వెబ్ సైట్ ద్వారా ఆడ్మిషన్లు పొందే అవకాశం ఉంది.

దోస్త్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆఫ్షన్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది.రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తే ధరఖాస్తు ప్రక్రియ పూర్తైనట్టే. అవసరమైన సర్టిఫికెట్లను కూడ ఆన్ లైన్లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

వీటిని పరిశీలించిన తర్వాత ఏ కాలేజీలో విద్యార్థులకు సీటు దక్కిందనే విషయాన్ని ప్రకటించనున్నారు. దీంతో ఆయా కాలేజీల్లో ఆడ్మిషన్స్ ఫార్మాలిటీస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ ఏడాది ఆగష్టు 24వ తేదీ నాటికి ఆడ్మిషన్స్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఈ  ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యా సంవత్సరం ప్రారంభించాలని ప్లాన్ చేశారు.


 

click me!