తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా పార్లమెంట్‌కు చేరుకున్నారు. మరో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌తో కలిసి రేవంత్ రెడ్డి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ఆయన నేరుగా పార్లమెంట్‌కు చేరుకున్నారు. మరో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌తో కలిసి రేవంత్ రెడ్డి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు కేబినెట్‌లో మిగతా బెర్తులపైనా అధిష్టానంతో చర్చించనున్నారు రేవంత్ రెడ్డి.
ALso Read: నాడు టీడీపీలో కీలకపాత్ర: వేర్వేరు దారుల్లో సీఎంలైన కేసీఆర్, రేవంత్ రెడ్డి
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించి సీఎంగా ఎంపికయ్యారు. దీంతో ఎంపీ , ఎమ్మెల్యేగా ఒకేసారి ప్రాతినిథ్యం వహించడానికి సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి తన పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఎంపీలుగా వున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలుగా ఆపై రేవంత్ రెడ్డి కేబినెట్‌లో మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. దీంతో వీరు కూడా తమ ఎంపీ పదవులుకు రాజీనామాలు చేయనున్నారు.