కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం... జగన్ కి కేసీఆర్ ప్రత్యేక ఆహ్వానం

Published : Jun 12, 2019, 02:05 PM IST
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం... జగన్ కి కేసీఆర్ ప్రత్యేక ఆహ్వానం

సారాంశం

కేవలం ప్రాజెక్టు ప్రారంభోత్సవ తేదీనే కాదు.. ఈ కార్యక్రమానికి వీచ్చేయనున్న ముఖ్య అతిథి పేరు కూడా ఖరారు చేశారు.


తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని సాగు, తాగు నీటి బాధలను శాశ్వతంగా పారదోలేందుకు చేపడుతున్న బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టు పూర్తయితే... తెలంగాణలోని ఎంతో మంది రైతుల సాగునీటి కష్టాలు తీరుతాయి. దీని కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. అయితే... ఈ ఎదురుచూపులకు పులిస్టాప్ పడింది. 

కాళేశ్వరం ప్రాజెక్టు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కేవలం ప్రాజెక్టు ప్రారంభోత్సవ తేదీనే కాదు.. ఈ కార్యక్రమానికి వీచ్చేయనున్న ముఖ్య అతిథి పేరు కూడా ఖరారు చేశారు.

ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఏపీ సీఎం జగన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో విజయవాడకు వెళ్లి స్వయంగా జగన్‌ను కేసీఆర్ ఆహ్వానించనున్నారు.
 

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్