యాదాద్రిలో ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్

By narsimha lodeFirst Published Sep 13, 2020, 2:23 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ఆదివారం నాడు పరిశీలించారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి  ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ ఆదివారం నాడు పరిశీలించారు.  హైద్రాబాద్ నుండి కేసీఆర్ రోడ్డు మార్గంలో యాదగిరిగుట్టకు చేరుకొన్నారు. ఆలయంలో ముఖ్యమంత్రికి సంప్రదాయబద్దంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

సీఎం కేసీఆర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన ఆలయంలో సాగుతున్న పనులను ఆయన అధికారులను అడిగి తెలుసుకొన్నారు. శివాలయం పుష్కరిణి పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఆలయానికి నలు దిక్కులా కృష్ణశిల రాతి విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు.ఆలయ దివ్య విమాన రాజగోపురానికి స్వర్ణ కాంతులు అద్దనున్నారు. 

ఆలయ పునర్నిర్మాణ పనులపై సీఎం కేసీఆర్ ఇవాళ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ పనులు వేగంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు.

ఆలయానికి వచ్చే రోడ్డు మార్గాలతో పాటు  ఇతర సౌకర్యాల గురించి సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ ఆలయ నిర్మాణ పనులను సమీక్షిస్తున్నారు. 
 

click me!