యాదాద్రికి సీఎం కేసీఆర్: ఆలయంలో ప్రత్యేక పూజలు

By Nagaraju penumalaFirst Published Dec 17, 2019, 12:44 PM IST
Highlights

అనంతరం బాలాలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

యాదాద్రి: యాదాద్రి పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోడ్డు మార్గాన యాదాద్రికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి జగదీష్ రెడ్డితోపాటు, ఆలయ నిర్వాహకులు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. 

యాదాద్రి ఆలయం వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు సీఎం కేసీఆర్. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్, ఇతర కాటేజ్ నిర్మాణాలను పరిశీలించారు. మహాసుదర్శనయాగం జరిగే ప్రాంతాన్ని కూడా పరిశీలించారు సీఎం కేసీఆర్. 

అనంతరం బాలాలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు కేసీఆర్‌ను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

అనంతరం కొండకింద ప్రెసిడెన్షియల్ సూట్ పనులు, పెద్దగుట్టపై చేపట్టాల్సిన పనులపై సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. నిర్మాణ పనులపై అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు. కొండకింద ప్రెసిడెన్షియల్ సూట్ పనులు, పెద్దగుట్టపై చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించి పలు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు కేసీఆర్. 

click me!