ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్: ఎంప్లాయిస్ ప్రమోషన్ల సర్వీసు రెండేళ్లకు కుదింపు

Published : Jan 11, 2021, 07:09 PM IST
ఉద్యోగులకు కేసీఆర్ గుడ్‌న్యూస్: ఎంప్లాయిస్ ప్రమోషన్ల సర్వీసు రెండేళ్లకు కుదింపు

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఉద్యోగులకు వరాల జల్లు కురిపించిన సీఎం మరోసారి  తీపికబురును అందించారు.

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే ఉద్యోగులకు వరాల జల్లు కురిపించిన సీఎం మరోసారి  తీపికబురును అందించారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ల కోసం  కనీస సర్వీసును మూడేళ్ల నుండి రెండేళ్లకు తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్ల ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి వయస్సును పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. నూతన సంవత్సర కానుకగా వేతనాలు పెంచుతామని ప్రకటించారు. ఈ రెండు నిర్ణయాలకు తోడుగా తాజా నిర్ణయంపై ఆయన సంతకం చేశారు.

ప్రభుత్వ విభాగంలోని అన్ని శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుండి ఉద్యోగ నియామకాలను చేపడుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులూ కలిసి 9, 36,976 మంది ఉంటారు. వీరందరికి వేతనాల పెంపు వర్తిస్తోందని ప్రభుత్వం తెలిపింది. 
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?