తెలంగాణలో 24 గంటల విద్యుత్, ఏపీలో విద్యుత్ కోతలు: గద్వాలలో కేసీఆర్

By narsimha lode  |  First Published Jun 12, 2023, 6:55 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  విద్యుత్ కోతలుంటే  తెలంగాణలో  24 గంటల పాటు విద్యుత్  సరఫరా అవుతున్న విషయాన్ని తెలంగాణ సీఎం  కేసీఆర్  చెప్పారు


గద్వాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ కోతలున్నాయని  తెలంగాణ సీఎం కేసీఆర్  విమర్శించారు.జోగులాంబ  గద్వాల జిల్లాలోని  తుంగభద్ర  బ్రిడ్జి  దాటితే  ఇటువైపు తెలంగాణలో  24 గంటల పాటు  విద్యుత్ సరఫరా అవుతుంటే 20 కి.మీ దూరంలోని  ఏపీ రాష్ట్రంలో   విద్యుత్ కోతలున్నాయని  సీఎం కేసీఆర్  చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే    అంధకారంగా మారుతుందనే  ప్రచారాన్ని  కేసీఆర్  ఈ సందర్భంగా  ప్రస్తావించారు.  తెలంగాణలో  24 గంటల పాటు విద్యుత్ సరఫరా  జరుగుతుంటే  ఏపీలో విద్యుత్ కోతలున్నాయని  కేసీఆర్ ఎద్దేవా చేశారు.

Latest Videos

undefined

సోమవారంనాడు  జోగులాంబ  గద్వాల  జిల్లాలో కొత్త కలెక్టరేట్, ఎస్పీ  కార్యాలయాన్ని  తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రారంభించారు. 
ఈ సందర్భంగా  గద్వాలలో  ఏర్పాటు  చేసిన  బహిరంగ సభలో  కేసీఆర్ ప్రసంగించారు.ఒకప్పుడూ  పాలమూరు జిల్లా వలస జిల్లాగా పేరుందన్నారు. కానీ  తెలంగాణ ఏర్పడితన తర్వాత  ఇతర రాష్ట్రాల నుండి  పాలమూరు జిల్లాకు  వలసలు పెరిగాయని కేసీఆర్  అభిప్రాయపడ్డారు.  

24 గంటల  విద్యుత్ , రైతు బంధు వంటి పథకాలు   కొనసాగాలంటే  మళ్లీ  బీఆర్ఎస్ ను గెలిపించాలని  తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రజలను కోరారు. గతంలో  ప్రజలను పట్టించుకోని వారు ధరణిని  తీసేస్తామంటున్నారన్నారు.  మీరు ధరణి  కావాలంటున్నారు. కొన్ని పార్టీలు  ధరణిని  వద్దంటున్నాయన్నారు. ధరణి వద్దనే వాళ్లకు  మీరే సమాధానం చెప్పాలని  కేసీఆర్  ప్రజలను కోరారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  14 రోజులకు  ఒకసారి మంచినీళ్లు వచ్చేవని కేసీఆర్ గుర్తు  చేశారు తెలంగాణ ఏర్పడిన  తర్వాత  మిషన్ భగీరథ  ద్వారా  ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్న విషయాన్ని  ఆయన  ప్రస్తావించారు.  గద్వాల, ఆలంపూర్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం   నిధులు మంజూరు చేయాలని  ఎప్పడు తనపై  ఒత్తిడి తెస్తుంటారని కేసీఆర్ చెప్పారు. గద్వాలలోని  ప్రతి గ్రామానికి  రూ. 10 లక్షలను గ్రాంట్ గా  ఇస్తున్నట్టుగా  కేసీఆర్  ప్రకటించారు. గద్వాల జిల్లాలోని మండలాలకు  రూ. 15 లక్షలను గ్రాంట్ గా  ఇస్తున్నట్టుగా కేసీఆర్ హామీ ఇచ్చారు. 
 

 


.

click me!