పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ... ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్

Published : May 03, 2019, 11:38 AM IST
పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ... ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్

సారాంశం

ప్రస్తుత కాలంలో చాలా మంది యువత... ప్రేమలో హద్దులు దాటుతున్నారు. పెళ్లి పీటలు ఎక్కకముందే.. పడక సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో యువతులు గర్భవతులు కూడా అవుతున్నారు.

ప్రస్తుత కాలంలో చాలా మంది యువత... ప్రేమలో హద్దులు దాటుతున్నారు. పెళ్లి పీటలు ఎక్కకముందే.. పడక సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో యువతులు గర్భవతులు కూడా అవుతున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి రంగారెడ్డి లో చోటుచేసుకుంది. పెళ్లి కాకుండానే తొందరపడటంతో... యువతి గర్భవతి అయ్యింది. ఈ విషయం బయటకు తెలిస్తే.. కష్టమని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో పోలీసుల దీనిపై దర్యాప్తు చేపట్టారు. 

రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలానికి చెందిన ఓ ప్రేమజంట తొందరపాటుతో యువతి గర్భం దాల్చింది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన ప్రియుడు, అమ్మాయి బంధువులతో కలిసి ఆమెకు అబార్షన్ చేయించేందుకు షాద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చాడు. బుధవారం రాత్రి ఓ డాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా ఆమెకు అబార్షన్ చేశాడు. ఈ విషయం గురువారం బయటకు పొక్కడంతో పోలీసులు ఆస్పత్రికి వచ్చి విచారణ చేపట్టారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ప్రేమ జంట, వారి బంధువులు, డాక్టర్ అప్పటికే ఆస్పత్రి నుంచి పరారయ్యారు. 

పోలీసులు ఇప్పుడు ఈ ఘటనపై విచారణ చేపడుతున్నారు. అబార్షన్ చేయించడం, చేయడం చట్టరిత్యా నేరం. దీంతో... అబార్షన్ చేయించుకున్న ప్రేమ జంట,  చేసిన డాక్టర్ కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?
రాష్ట్రంలో పాలనా పిచ్చోడి చేతిలో రాయి లా మారింది KTR Comments on Revanth Reddy | Asianet News Telugu