భద్రాచలం వద్ద గోదావరి పోటెత్తడంతో హెలికాప్టర్ తో పాటు అవసరమైన సామాగ్రిని పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు సీఎం కేసీఆర్. భద్రాచలం వద్ద గోదావరి 70 అడుగుల దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.
హైదరాబాద్: Godavari కి భద్రాచలం వద్ద భారీగా పెరిగిన నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. Helicopter తో పాటు ఇతర అవసరమైన సామాగ్రిని పంపాలని కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు సీఎం KCR
Bhadrachalam వద్ద గోదావరి 70 అడుగులను దాటే అవకాశం ఉంది. దీంతో భద్రాచలం వద్ద పరిస్థితిని సీఎం ేకసీఆర్ సీఎస్ సోమేష్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు.
undefined
భారీ వానలతో గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. స్థానిక మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో వుంటూ ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయం చేసుకుంటున్నారు. భద్రాచలం వద్ద వరద పరిస్థితిని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
భద్రాచలం జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరో వైపు వరద మరింత పెరిగే అవకాశం ఉన్నందున ఎన్డీఆరెఫ్ సిబ్బందిని, రెస్కూ టీం లు సహా హెలీకాప్టర్లను అందుబాటులోకి తేవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.భధ్రాచలంలో క్రేత్రస్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ఖమ్మం జిల్లా మంత్రి Puvvada Ajay Kumar అభ్యర్థన మేరకు హెలికాప్టర్ ను అందుబాటులో ఉంచాలని సిఎం కెసిఆర్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి Somesh Kumar ను ఆదేశించారు.
also read:భద్రాచలం వద్ద 68 అడుగులకు చేరిన గోదావరి:48 గంటలు అప్రమత్తం
వరదబాధితులను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఉపయోగ పడే లైఫ్ జాకెట్లు., తదితర రక్షణ సామగ్రిని ఇప్పటికే తరలించాలని కూడా సీఎం ఆదేశించారు.