ఉద్యోగులకు కేసీఆర్ న్యూఇయర్ గిఫ్ట్: వేతనాలు పెంపు సహా మరెన్నో

By Siva KodatiFirst Published Dec 29, 2020, 7:24 PM IST
Highlights

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ న్యూఇయర్ కానుక ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంచాలని, అన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి కేసీఆర్ ఆదేశించారు.

అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆర్టీసీపై భారమంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఫిబ్రవరిలోపే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభమవుతుందని.. ఉద్యోగులతో చర్చలకు సీఎస్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగుల పాత్ర గొప్పదని... మార్చి నుంచి ఉద్యోగులంతా సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీస్ రూల్స్ ఉంటాయని.. పదవీ విరమణ రోజే ఆఫీసులో ఘనంగా సన్మానం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అలాగే రిటైర్మెంట్ రోజే పదవీ విరమణ బెనిఫిట్స్ అందుతాయని ముఖ్యమంత్రి వెల్లడించారు.

కారుణ్య నియామకాల ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల 9 లక్షల 36 వేల 976 మంది ఉద్యోగులకు పెంపు వర్తిస్తుంది. 

click me!