కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్: ఇక నుండి ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు

By narsimha lodeFirst Published Dec 29, 2020, 5:43 PM IST
Highlights

ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడ రిజిస్ట్రేషన్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
 


హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడ రిజిస్ట్రేషన్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.గతంలో ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. 

రాష్ట్రంలో పలు చోట్ల ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు కూడ రిజిస్ట్రేషన్ చేయాలని నిరసనలు కొనసాగుతున్నాయి. ఎల్ఆర్ఎస్ విషయంలో విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు కీలక ఆదేశాలు జారీ చేసింది.

గతంలో ఎల్ఆర్ఎస్ అనుమతి పొందినవాటికి రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అఫ్రూవల్ పొందిన తర్వాతే రిజిస్ట్రేషన్లు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకొంది. 

కొత్త లే ఔట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుమతి లేని లే ఔట్లను క్రమబద్దీకరించుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 

భూముల క్రమబద్దీకరణ కోసం ప్రభుత్వం విధించిన ఫీజు ఎక్కువగా ఉందని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. దీంతో  2015 సంవత్సరంలో విధించిన ఫీజును వసూలు చేయాలని నిర్ణయం తీసుకొంది. ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం తీరును విపక్షాలతో పాటు రియల్ ఏస్టేల్ వ్యాపారులు తీవ్రంగా విమర్శించారు.

రాష్ట్రంలోని పలు చోట్ల రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఎదుట రియల్ ఏస్టేట్ వ్యాపారులు  ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 
 

 


 

click me!