ప్రధాని మోడీతో ముగిసిన కేసీఆర్ భేటీ.. పది అంశాలపై ప్రత్యేక వినతి, నదీజలాల వివాదంపై చర్చ

Siva Kodati |  
Published : Sep 03, 2021, 05:40 PM ISTUpdated : Sep 03, 2021, 10:10 PM IST
ప్రధాని మోడీతో ముగిసిన కేసీఆర్ భేటీ.. పది అంశాలపై ప్రత్యేక వినతి, నదీజలాల వివాదంపై చర్చ

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ ప్రధానితో చర్చించారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేసీఆర్ ప్రధానితో చర్చించారు. ఈ సందర్భంగా పది అంశాలకు సంబంధించిన లేఖలను కేసీఆర్.. ప్రధానికి అందజేశారు. కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌పై మోడీతో చర్చించారు. అలాగే ఐపీఎస్‌ల సంఖ్య పెంపు, కొత్త జిల్లాలకు సరిపడా ఐపీఎస్‌లను కేటాయించాలని సీఎం ... మోడీని కోరారు. హైదరాబాద్-నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్‌పైనా విజ్ఞప్తి చేశారు. కొత్త జిల్లాలకు జవహర్ నవోదయా విద్యాలయాలను కేటాయించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు గిరిజన వర్సిటీ, ఐఐఎం, కరీంనగర్‌కు ఐఐఐటీ ఏర్పాటు చేయాలని  కోరారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన కు అదనపు నిధులతో పాటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన మెరుగుపరచాలని కేసీఆర్ .. మోడీని విజ్ఞప్తి చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే