గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళ్ హట్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోద చేశారు. సోషల్ మీడియాలో పోస్టుకు సంబంధించి ఈ కేసు నమోదైంది.
హైదరాబాద్: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై మంగళ్ హట్ పోలీస్ స్టేషన్ లో మరో కేసు నమోదైంది. ఈ నెల 6వ తేదీన ట్విట్టర్ లో రాజాసింగ్ చేసిన పోస్టుపై పోలీసులు అబ్యంతరం వ్యక్తం చేశారు.ఈ పోస్టు విషయమై రాజాసింగ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని కూడ పోలీసులు ఆదేశించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారని పోలీసులు ఆరోపించారు.ఈ ఆరోపణలను రాజాసింగ్ తరపు న్యాయవాది స్పందించారు. పోలీసులు ఇచ్చిన నోటీసులపై రాజాసింగ్ న్యాయవాది సమాధానం పంపారు.
ఈ సమాధానంపై పోలీసులు సంతృప్తి చెందలేదు. దీంతో మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ లో రాజాసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయమై రాజాసింగ్ స్పందించారు. గతంలో ఓవైసీ సోదరులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని రాజాసింగ్ గుర్తు చేశారు. వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదో చెప్పాలని రాజాసింగ్ ప్రశ్నించారు.ఉన్నతాధికారుల మెప్పుపొందేందుకే ఈ రకంగా తనపై కేసులు నమోదు చేస్తున్నారని రాజాసింగ్ వ్యాఖ్యానించారని ప్రముఖ తెలుగున్యూస్ చానెల్ ఈటీవీ కథనం ప్రసారం చేసింది.
undefined
ఈ ఏడాది నవంబర్ 9వ తేదీన చర్లపల్లి జైలు నుండి రాజాసింగ్ విడుదలయ్యారు. పలు షరతులతో హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.మూడు మాసాల పాటు సోషల్ మీడియాలో పోస్టులు చేయవద్దని కూడా హైకోర్టు సూచించింది. రాజాసింగ్ పై పీడీయాక్టు నమోదు చేసి ఈ ఏడాది ఆగస్టు 25న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
also read:సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, రాజాసింగ్‌కి పోలీసుల నోటీసులు.. వివరణకు రెండు రోజుల డెడ్‌లైన్
ఈ ఏడాది ఆగస్టు 22న సోషల్ మీడియాలో రాజాసింగ్ పోస్టు చేసిన వీడియో వివాదానికి కారణమైంది.ఈ వీడియోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఎంఐఎం ఆరోపించింది. రాజాసింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆందోళనలు నిర్వహించారు.ఆగస్టు 22న అరెస్ట్ చేశారు. అయితే రాజాసింగ్ కు రిమాండ్ విధించలేదు కోర్టు. దీంతో ఆయనను పోలీసులు విడిచిపెట్టారు.అయితే పాత కేసులను దృష్టిలో ఉంచుకొని రాజాసింగ్ పై పీడీయాక్ట్ ను నమోదు చేసి ఆగస్టు 25న పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో చర్లపల్లి జైలులో ఉన్న రాజాసింగ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఈ ఏడాది నవంబర్ 9వ తేదీన విడుదలయ్యారు.