నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ప్రారంభించిన కేసీఆర్

Published : Jun 17, 2019, 12:03 PM ISTUpdated : Jun 17, 2019, 12:09 PM IST
నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్ ను ప్రారంభించిన కేసీఆర్

సారాంశం

హైద్రాబాద్‌ హైదర్‌గూడలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యేల నూతన నివాస గృహ సముదాయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు.

"
అమరావతి: హైద్రాబాద్‌ హైదర్‌గూడలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఎమ్మెల్యేల నూతన నివాస గృహ సముదాయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండేవి. హైదర్‌గూడలోని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను కూల్చివేసి ఆ స్థానంలో కేసీఆర్ ప్రభుత్వం కొత్త క్వార్టర్స్‌ను నిర్మించింది.

4.26 ఎకరాల స్థలంలో రూ. 166 కోట్ల వ్యయంతో  ఈ క్వార్టర్స్‌ను నిర్మించారు. 120 మందికి ఎమ్మెల్యేలకు క్వార్టర్స్‌తో పాటు ఎమ్మెల్యేలకు సహాయకులుగా ఉండే వారికి కూడ ఇదే ఆవరణలో 120 క్వార్టర్స్‌ను నిర్మించారు.

అసెంబ్లీలో పనిచేసే 36 మంది సిబ్బందికి కూడ ఇదే ఆవరణలో  క్వార్టర్స్‌ను నిర్మించారు. తొలిసారిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికైన సమయంలో  ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం