మీరేం రంది పడకండి, ఆడపడుచులకు కేసీఆర్ వినతి

Published : Oct 04, 2018, 08:55 PM IST
మీరేం రంది పడకండి, ఆడపడుచులకు కేసీఆర్ వినతి

సారాంశం

ఎన్నికల కోడ్ నిబంధన వల్ల తెలంగాణ ఆడపడుచులకు చీరలు పంపిణీ చెయ్యలేకపోతున్నామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలోని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ వస్తే పండుగ చేసుకుంటారని ఎవరూ పట్టించుకోకపోయినా టీఆర్ఎస్ పట్టించుకుందన్నారు.   

నల్గొండ: ఎన్నికల కోడ్ నిబంధన వల్ల తెలంగాణ ఆడపడుచులకు చీరలు పంపిణీ చెయ్యలేకపోతున్నామని ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లాలోని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ వస్తే పండుగ చేసుకుంటారని ఎవరూ పట్టించుకోకపోయినా టీఆర్ఎస్ పట్టించుకుందన్నారు. 

టీఆర్ఎస్ పార్టీ మహిళలను గౌరవించి 95లక్షల చీరలు పంచుదామనుకుంటే కొందరు కోర్టుకు వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గూడురు నారాయణరెడ్డి అనే భువనగిరికి చెందిన వ్యక్తి ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేశారన్నారు. 

ఆడపిల్లల నోటికాడ కూడు గుంజేసి చీరలు పంచొద్దని చెబుతున్నారని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధన ఉండటం వల్ల దసరాలోపు చీరలు పంచలేకపోతున్నామన్నారు. ఎన్నికల కోడ్ ఎత్తేసిన తెల్లారే మీ ఊర్లోనే, మీ కాళ్లదగ్గరికి తెచ్చి చీరలు మీ చేతుల్లో పెడతామని హామీ ఇచ్చారు. మీరేం రంది పడకండి అంటూ ఆడపడుచులను కోరారు.  

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?