మాజీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్

Published : Apr 15, 2019, 08:36 PM IST
మాజీ ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ బంపర్ ఆఫర్

సారాంశం

ఈ సందర్భంగా పలువురు మాజీ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు కేసీఆర్. అదిలాబాద్ జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేరును  ప్రకటించారు. అలాగే పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్పర్సనర్ గా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధును ప్రకటించారు. 

హైదరాబాద్: 16 పార్లమెంట్ అభ్యర్థులతో దేశ రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పేది టీఆర్ఎస్ పార్టీయేనని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 16 సీట్లు గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. 

ఇప్పటికే 10 సర్వేలు ఇవే తేల్చి చెప్పాయని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తీరు, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వంటి అంశాలపై చర్చించారు. 

ప్రస్తుత రాజకీయాలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అడిగి తెలుసుకున్నారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. 535 జెడ్పీటీసీ, 5,857 ఎంపీటీసీ, 32 జెడ్పీ చైర్మన్‌ పదవులు గెలిపించుకోవాలని కోరారు. 

ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రెండు జిల్లాలకు చొప్పున మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కో ఆర్డినేటర్లుగా ప్రకటించారు. ఇకపోతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక ఆయా ఎమ్మెల్యేలకే వదిలేశారు. గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా వారిదేనన్నారు. 

ఈ సందర్భంగా పలువురు మాజీ ఎమ్మెల్యేలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు కేసీఆర్. అదిలాబాద్ జెడ్పీచైర్మన్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పేరును  ప్రకటించారు. అలాగే పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్పర్సనర్ గా మాజీ ఎమ్మెల్యే పుట్టా మధును ప్రకటించారు. 

నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, కొత్త వారికి అవకాశాలు వస్తాయని నేతలకు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఓడిపోయిన ఎమ్మెల్యేలకు అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శులకు సైతం పదవులు ఇస్తామని తేల్చి చెప్పారు. మరోవైపు రెవెన్యూ, మున్సిపల్ శాఖలను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.    

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం