చినజీయర్ స్వామితో కేసీఆర్ భేటీ: మూడుగంటలపాటు మంతనాలు

Published : Jul 30, 2019, 06:46 PM IST
చినజీయర్ స్వామితో కేసీఆర్ భేటీ: మూడుగంటలపాటు మంతనాలు

సారాంశం

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమంలో చినజీయర్ స్వామితో దాదాపు మూడు గంటలపాటు ఏకాంతంగా గడిపారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను సీఎం కేసీఆర్ కు చినజీయర్ స్వామి అందజేశారు.   

శంషాబాద్ : శంషాబాద్ లోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో తెలంగాణ సీఎం కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. ప్రగతిభవన్ నుంచి నేరుగా శంషాబాద్ లోని చినజీయర్ స్వామి ఆశ్రమానికి కేసీఆర్ చేరుకున్నారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆశ్రమ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆశ్రమంలో చినజీయర్ స్వామితో దాదాపు మూడు గంటలపాటు ఏకాంతంగా గడిపారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను సీఎం కేసీఆర్ కు చినజీయర్ స్వామి అందజేశారు. 

సీఎం కేసీఆర్ తోపాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్, మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావుతోపాటు ఎండీ జగపతిరావులు కూడా చినజీయర్ స్వామిని కలిసిన వారిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?