
వనపర్తి:దేశంలోని పలు రాష్ట్రాల్లో కంటే అన్ని విభాగాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు.మన ఊరు- మన బడి కార్యక్రమాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం నాడు వనపర్తిలో ప్రారంభించారు. వనపర్తి జిల్లాలో పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో తెలంగాణ సీఎం KCR మంగళవారం నాడు పాల్గొన్నారు. హైద్రాబాద్ నుండి Wanaparthy కి ఇవాళ ఉదయం సీఎం కేసీఆర్ వచ్చారు. చిట్యాల వద్ద సీఎం కేసీఆర్ కు జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు స్వాగతం పలికారు. తొలుత Chityalలో వ్యవసాయ మార్కెట్ ను కేసీఆర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన Mana Ooru Mana Badi కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు.
కొన్ని రాష్ట్రాల్లో సెక్రటేరియట్ల కంటే కూడా మన రాష్ట్రంలోని జిల్లాల కలెక్టరేట్లు ఉన్నాయని సీఎం సోమేష్ కుమార్ తనకు చెప్పారని సీఎం కేసీఆర్ చెప్పారు. ఎనిమిదేళ్ల క్రితం Palamuru జిల్లా అంటే కరువు జిల్లాగా పేరొందన్నారు. ఈ జిల్లా నుండి Mumbai కి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లేవారన్నారు. పాలమూరు జిల్లాలో కరువు మాయమై పంటు పండుతున్నాయన్నారు. వనపర్తి జిల్లా ఏర్పాటు కావడంతో పాటు మంచి కలెక్టరేట్ భవనాన్ని నిర్మించుకొన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
పలు విభాగాల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ ముందుందని కేసీఆర్ చెప్పారు.ఈ విషయాన్ని నిన్న అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన ఆర్ధిక సర్వే తేట తెల్లం చేసిందన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని కేసీఆర్ గుర్తు చేశారు. తలసరి ఆదాయంలో కూడా తెలంగాణ నంబర్ వన్ గా ఉందన్నారు. జీఎస్‌డీపీలో కూడా తెలంగాణ ముందు వరుసలో ఉందని కేసీఆర్ చెప్పారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యమై జిల్లాను అభివృద్ది చేసుకొంటున్నామన్నారు. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇష్టపడి పనిచేసి అభివృద్ది చేసుకుంటున్నామని సీఎం తెలిపారు.ఉత్తమమైన ఉద్యోగుల సర్వీస్ రూల్స్ తెలంగాణలోనే ఉన్నాయని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
ఇవాళ తెలంగాణలో సాధించింది అతి తక్కువ అని ఆయన అన్నారు. దీన్ని చూసే చాలా మంది ఈర్ష్యపడుతున్నారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో జరిగిన ప్రచారానికి భిన్నంగా తెలంగాణలో అభివృద్ది సాగుతుందన్నారు.
తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రల కంటే తలసరి ఆదాయంతో పాటు GSDP ఎక్కువని కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పీక్ అవర్ లో విద్యుత్ డిమాండ్ 13,600 మెగావాట్లుంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో సుమారు 14 వేల మెగావాట్లకు విద్యుత్ వినియోగం చేరుకొందని కేసీఆర్ చెప్పారు.
మంచినీళ్లు, విద్యుత్ కష్టాలు తీరాయన్నారు. సాగు నీటి కష్టాలు కూడా తీరనున్నాయని చెప్పారు. ప్రస్తుతం విద్య, వైద్యం పై కేంద్రీకరించామని కేసీఆర్ తెలిపారు..మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఇక్కడే ప్రారంభించుకొన్నామన్నారు. వనపర్తిలో అభివృద్ది కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. నిరంజన్ రెడ్డి లాంటి ప్నేహితుడు తనకు ఉండడం తన అదృష్టమన్నారు సీఎం కేసీఆర్.
వనపర్తి మున్సిపాలిటీకి కోటి రూపాయాలు, జిల్లాలోని ఇతర మున్సిపాలిటీలకు రూ. 50 లక్షలు, జిల్లాలోని గ్రామ పంచాయితీలకు రూ. 20 లక్షల నిధులను మంజూరు చేస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు.