ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ.. ప్రధాని నిర్ణయం ప్రమాదకరం: భట్టి హెచ్చరిక

By Siva KodatiFirst Published Mar 2, 2021, 3:34 PM IST
Highlights

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తే బలహీన వర్గాల వారీ ఉద్యోగాలు పోతాయని ఆరోపించారు తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నిర్ణయం చాలా ప్రమాదకరమని భట్టి ఆందోళన వ్యక్తం చేశారు. 

తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసమని... లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా వున్నాయని పీఆర్సీ చెప్పిందని విక్రమార్క గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల కారణంగా యువత ఉద్యోగాలు లేక నిరాశ, నిస్పృహలకు లోనై సమాజానికి పెద్ద ప్రమాదంగా మారే అవకాశం వుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో గ్రాడ్యుయేట్లు టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని భట్టి పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ చెప్పి రెండేళ్లు గడిచిపోతోందని.. కానీ ఇంత వరకు దానికి సంబంధించిన విధివిధానాలు ఖరారు చేయలేదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు.

ఒక్క తెలంగాణలోనే 33 శాతం నిరుద్యోగిత వుందని ఆయన తెలిపారు. కరోనా కారణంగా సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు మూసివేతకు గురవుతున్నప్పుడు.. వాటిని నిలబెట్టేందుకు కావాల్సిన ఆర్ధిక ప్యాకేజీని ఇవ్వలేదని, చివరికి ప్రభుత్వ రంగ సంస్థలను సైతం మూసేస్తున్నామని ప్రధాని చెబుతున్నారని భట్టి ఎద్దేవా చేశారు. 

click me!