బెంగాల్ ఎన్నికలు: దీదీతో తేజస్వి యాదవ్ భేటీ

By narsimha lodeFirst Published Mar 2, 2021, 2:57 PM IST
Highlights

సెక్యులర్‌ పార్టీల మధ్య ఐక్యతకోసం  ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్‌ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కి ఓటు వేయాలని పశ్చిమబెంగాల్‌లోని బీహార్‌ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 


కోల్‌కత్తా:  సెక్యులర్‌ పార్టీల మధ్య ఐక్యతకోసం  ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్‌ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌కి ఓటు వేయాలని పశ్చిమబెంగాల్‌లోని బీహార్‌ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. 

రాష్ట్ర సెక్రటేరియట్‌లో దీదీని కలిసిన తరువాత, బెంగాల్‌లో బీజేపీని అడ్డుకోవ డమే తమ పార్టీ ప్రథమ ప్రాధాన్యత అని ప్రకటిం చారు. రాబోయే ఎన్నికలు ఆదర్శాలు, విలువ లను కాపాడుకునేందుకేనని తేజస్వి చెప్పారు. మా పార్టీ మమతా బెనర్జీకి సంపూర్ణ మద్దతు తెలుపుతోందని ఆయన స్పష్టం చేశారు. 

బెంగాల్ రాష్ట్రంలో 8 విడుతల ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ఈసీ ప్రకటించింది. గత వారంలో ఈసీ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ను విడుదల  చేసింది. బెంగాల్ లో 8 విడుతలుగా ఎన్నికలు నిర్వహించడంపై కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

బెంగాల్ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు గాను టీఎంసీ చీఫ్ ప్రయత్నిస్తోంది. ఈ దఫా రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది.

టీఎంసీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. టీఎంసీకి చెందిన కీలక నేత సువేంధు అధికారి బీజేపీలో చేరారు. నందిగ్రామ్ నుండి మమత బెనర్జీ పోటీ చేయనున్నారు. మమతను ఓడిస్తానని సువేంధు అధికారి సవాల్ చేశారు.

click me!