ముంపు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్దరణ: అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష

By narsimha lode  |  First Published Jul 19, 2022, 4:29 PM IST

రాష్ట్రంలో వరద ముంపు ప్రాంతాల్లో సహాయ  కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారిని నియమించినట్టుగా తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ చెప్పారు.
 


హైదరాబాద్: రాష్ట్రంలో వరద ముంపు ప్రాంతాల్లో సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారిని నియమించినట్టుగా తెలంగాణ సీఎస్ Somesh Kumar ప్రకటించారు.

వరద ముంపు గ్రామాల్లో  సహాయ, పునరావాస కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లు, సీనియర్ అధికారులతో  సీఎస్ సోమేష్ కుమార్ మంగళవారం నాడు  Tele Conference నిర్వహించారు.  ప్రతీ గ్రామంలో మెడికల్, విద్యుత్, శానిటేషన్, తదితర విభాగాల బృందాలను ప్రత్యేకంగా నియమించి సమర్థవంతంగా పునరావాస చర్యలను కొనసాగిస్తున్నట్టుగా సీఎస్ వివరించారు.

Latest Videos

undefined

పంచాయతీ రాజ్ శాఖ ద్వారా 4100 మంది శానిటేషన్ సిబ్బందిని ఇతర జిల్లాల నుండి తరలించి సహాయ పునరావాస చర్యలను  చేపట్టామన్నారు.మున్సిపల్ శాఖ నుండి 400 మంది శానిటేషన్ సిబ్బంది, మొబైల్ టాయిలెట్లు, ఇతర ఎమెర్జెన్సీ సామాగ్రిని తరలించామని తెలిపారు.

ప్రతీ గ్రామానికి ముగ్గురు, నలుగురు పంచాయితీ కార్యదర్శులను ప్రత్యేకంగా నియమించి శానిటేషన్ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్లతోపాటు తోపాటు పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్, ఆరోగ్య శాఖ డైరెక్టర్, ప్రత్యేకాధికారి రజత్ కుమార్ సైనీలు ఈ సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న విషయాన్ని సోమేష్ కుమార్ గుర్తు చేశారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రస్తుతం 436 వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్య సదుపాయాలూ అందచేస్తున్నామన్నారు.ఇప్పటివరకు 10,000 మందికి పైగా వైద్య చికిత్సలు అందించినట్టుగా సోమేష్ కుమార్ తెలిపారు.

ఇప్పటి వరకు ఏవిధమైన మలేరియా, డెంగ్యూ కేసులు గానీ నమోదు కాలేదన్నారు.  ప్రతీ మండలానికి ఒక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, జిల్లా మలేరియా అధికారులను నియమించినట్టుగా సీఎస్ చెప్పారు.

గర్భిణీ స్త్రీలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.ప్రతీ పునరావాస కేంద్రాల్లోనూ వైద్య శిబిరాలను ఏర్పాటు చేసినట్టుగా సీఎస్ చెప్పారు. అన్ని గ్రామాల్లో విధ్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నామని తెలిపారు.ఇప్పటివరకు జిల్లా అధికారులు సహాయ పునరావాస చర్యలలో సమర్థవంతంగా  పనిచేశారని ఆయన అభినందించారు.

ఈ టెలీకాన్ఫరెన్స్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ తోపాటు మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, విపత్తుల నివారణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వి,  పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయితీ రాజ్ శాఖ డైరెక్టర్ హనుమంత రావు, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 

click me!