రాజ్‌భవన్‌లో పూర్తయిన కొత్తమంత్రుల ప్రమాణ స్వీకారం

By Siva KodatiFirst Published Feb 19, 2019, 11:37 AM IST
Highlights

రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్.. వారితో ప్రమాణం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి విడతగా పదిమంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు. 

సీహెచ్ మల్లారెడ్డి మంత్రిగ ా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో టీడీపీ నుంచి మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన ఆయన తర్వాత టీఆర్ఎస్‌లో చేరారు. తాజా ఎన్నికల్లో మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి భారీగా మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. సీఎంఆర్ విద్యాసంస్థల అధినేతగా ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన గవర్నర్ పాదాలకు నమస్కరించారు. 

వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బాల్కొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గతంలో మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు.

శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఈయన.. ఎన్జీవో నేతగా తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 

ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. పాలకుర్తి నుంచి ఎమ్మెల్యేగా  ఎన్నికయ్యారు.

కొప్పుల ఈశ్వర్ మంత్రిగా ప్రమాణం చేశారు. కరీంనగర్ జిల్లాకు ధర్మపురి నుంచి ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్‌గా పనిచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరు. 

సింగిరెడ్డి నీరంజన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వనపర్తి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన గతంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 

టీఆర్ఎస్ సీనియర్ నేత ఈటల రాజేందర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో టీఆర్ఎస్ ఎల్పీ నేతగా పనిచేసిన ఆయన గత కేబినెట్‌లో ఆర్ధిక, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేశారు. 

జగదీశ్ రెడ్డి మంత్రిగా ప్రమాణం చేశారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జగదీశ్ రెడ్డి.. గత కేబినెట్‌లో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 

తలసాని శ్రీనివాస్ యాదవ్ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు కేబినెట్‌లలో మంత్రిగా పనిచేసిన తలసాని .. కేసీఆర్ గత కేబినెట్‌లో పనిచేశారు. 

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన.. గత కేబినెట్‌లో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. 

రాజ్‌భవన్‌లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలైంది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్.. వారితో ప్రమాణం చేయిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి విడతగా పదిమంది ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించారు.

వీరిలో ఈటల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు గత కేబినెట్‌లో మంత్రులుగా పనిచేయగా... ఎస్.నిరంజన్ రెడ్డి, పి.శ్రీనివాస్‌గౌడ్, సీహెచ్ మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డిలు కొత్తవారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 

click me!