కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ.. వీటిపైనే ప్రధానంగా చర్చ..!

Published : Aug 11, 2022, 03:26 PM IST
 కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ..  వీటిపైనే ప్రధానంగా చర్చ..!

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ  కొనసాగుతుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ, తదితర అంశాలపై కేబినెట్ సమావేశం చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ  కొనసాగుతుంది. ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రానికి అదనపు వనరుల సమీకరణ, తదితర అంశాలపై కేబినెట్ సమావేశం చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భంగా ఈ నెల 21న ఒకరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహణపై కూడా భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. 

దీంతోపాటుగా వృద్ధాప్య పింఛన్ల వయసు 57 ఏళ్లకు తగ్గింపు, డయాలసిస్‌ పేషంట్లకు పెన్షన్లు, అనాథ పిల్లల సంరక్షణకు పాలసీ, స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీల విడుదల, తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అలాగే మునుగోడు ఉప ఎన్నికపై కూడా కేబినెట్ భేటీలో చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!