రేపటి మంత్రివర్గ సమావేశం వాయిదా.. మంత్రులు, అధికారులు అప్రమత్తంగా ఉండండి:కేసీఆర్

First Published Jul 8, 2018, 5:21 PM IST
Highlights

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్రమత్తమయ్యారు. రేపు జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అప్రమత్తమయ్యారు. రేపు జరగాల్సిన తెలంగాణ మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.. అన్ని జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉన్నందున.. మంత్రులు, అధికారులు జిల్లాల్లోనే ఉండాలని.. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. వర్షాల కారణంగా ఎవరైనా నష్టపోతే దగ్గరుండి సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

click me!