బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత

Siva Kodati |  
Published : Feb 23, 2019, 06:42 PM ISTUpdated : Feb 23, 2019, 06:50 PM IST
బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్‌రెడ్డి కన్నుమూత

సారాంశం

బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్ధం బాల్‌రెడ్డి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 

కార్వాన్ నియోజకవర్గం నుంచి బద్ధం మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాతబస్తీలో ఎంఐఎంకు ధీటుగా పార్టీని విస్తరించారు. అప్పట్లో ఎంఐఎం అధినేత సలావుద్దీన్ ఓవైసీకి ఓల్డ్‌సిటీలో బాల్‌రెడ్డి గట్టి పోటీ ఇచ్చారు.

పాతబస్తీతో పాటు హైదరాబాద్‌లో బీజేపీ బలోపేతానికి కృషి చేసిన ఆయనను అభిమానులు గోల్కొండ టైగర్‌ అని పిలుచుకునేవారు. పార్టీకి ఆయన చేసిన సేవలకు గాను పలుమార్లు బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవికి పరిశీలించింది.

ఇటీవల జరిగిన తెలంగాణ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. కొంతకాలంగా లివర్ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న బాల్‌రెడ్డి బంజారాహిల్స్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?