బద్దం బాల్ రెడ్డి హెల్త్ కండీషన్ గురించి వివరించిన రాజాసింగ్ (వీడియో)

Published : Feb 23, 2019, 05:49 PM ISTUpdated : Feb 23, 2019, 05:51 PM IST
బద్దం బాల్ రెడ్డి హెల్త్ కండీషన్ గురించి వివరించిన రాజాసింగ్ (వీడియో)

సారాంశం

తెలంగాణ బిజెపి సీనియర్ నాయకులు బద్దం బాల్ రెడ్డి మృతిచెందినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు.  ఆయన ఇంకా ప్రాణాలతో వుండగానే ఇలాంటి వార్తలను ప్రచారం చేయడం తగదన్నారు. ఆయన పరిస్థితి విషమంగానే వున్నప్పటికి బ్రతికే వున్నారన్నారు. డాక్టర్లు కొద్దిసేపటికి క్రితమే ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను తమకు అందించారని రాజాసింగ్ తెలిపారు.   

బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్లో ఈ నెల 10 తేదీన బాల్ రెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ జాయిన్ అయ్యారు. ఆయన లివర్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నట్లు గుర్తించిన డాక్టర్లు వైద్యాన్ని అందించారు. అయితే అప్పటి నుండి మెళ్లిమెళ్లిగా క్షీణిస్తూ వచ్చిన ఆయన ఆరోగ్య పరిస్థతి ఇవాళ పూర్తిగా విషమించింది. 

ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొందరు బాల్ రెడ్డి మృతిచెందినట్లు ప్రచారం చేశారు. దీంతో ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియా ముందుకు వచ్చి బాల్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. బాల్ రెడ్డి వంటి మహోన్నత నేత మన మధ్య ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ఆయన మృతిచెందినట్లు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది...దాన్ని ఎవరు నమ్మకూడదని రాజాసింగ్ సూచించారు. 

వీడియో

"

PREV
click me!

Recommended Stories

JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?
Venkaiah Naidu Speech: వెంకయ్య నాయుడు పంచ్ లకి పడిపడి నవ్విన బ్రహ్మానందం| Asianet News Telugu