ఓవైసీ బ్రదర్స్ తో భారత్ మాతాకీ జై అనిపించగలరా..?: కేటీఆర్ కు బీజేపీ సవాల్

Published : Aug 12, 2019, 09:02 PM IST
ఓవైసీ బ్రదర్స్ తో భారత్ మాతాకీ జై అనిపించగలరా..?: కేటీఆర్ కు బీజేపీ సవాల్

సారాంశం

బీజేపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న కేటీఆర్ ఓవైసీ సోదరులతో భారత్ మాతాకీ జై అనే నినాదం అనిపించగలరా? అంటూ సవాల్ విసిరారు. టీఆర్ఎస్‌తో ఉంటే తెలంగాణ వాదులు.. లేకుంటే ఆంధ్రా తొత్తులా? అంటూ నిప్పులు చెరిగారు.    

హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. దేశభక్తిపై  కేటీఆర్ శ్రీరంగ నీతులు చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు. బీజేపీపై కేటీఆర్ చేస్తున్న విమర్శలను లక్ష్మణ్ ఖండించారు. 

బీజేపీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న కేటీఆర్ ఓవైసీ సోదరులతో భారత్ మాతాకీ జై అనే నినాదం అనిపించగలరా? అంటూ సవాల్ విసిరారు. టీఆర్ఎస్‌తో ఉంటే తెలంగాణ వాదులు.. లేకుంటే ఆంధ్రా తొత్తులా? అంటూ నిప్పులు చెరిగారు.  

మజ్లిస్‌ను కట్టడి చేసే ధైర్యం కేసీఆర్‌కు ఉందా? అని లక్ష్మణ్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీకి తోక పార్టీగా కాంగ్రెస్ పార్టీ మారిందని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి బీజేపీని అడ్డుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కేటీఆర్ కోసం హరీష్ గొంతు కోసావ్: కేసీఆర్ పై వివేక్ ఘాటు విమర్శలు

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు