మీరు ఒకసారే.. కిషన్ రెడ్డి ఏడు సార్లు: కేసీఆర్ గాంధీ పర్యటనపై బండి సంజయ్ సెటైర్లు

By Siva KodatiFirst Published May 20, 2021, 5:36 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఎందుకు ఆపేశారని నిలదీశారు. గాంధీకి వెళ్లి కేసీఆర్ ఏం సాధించారని సంజయ్ ప్రశ్నించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ఎందుకు ఆపేశారని నిలదీశారు. గాంధీకి వెళ్లి కేసీఆర్ ఏం సాధించారని సంజయ్ ప్రశ్నించారు.

అయితే వరంగల్ ఎంజీఎంకు ఈరోజే ఎందుకు వెళ్లడం లేదని సంజయ్ ప్రశ్నించారు. ఎంజీఎంలో అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత రేపు వెళ్లడం ఏంటని నిలదీశారు. గాంధీకి సీఎం ఒకసారి వెళ్తే.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏడుసార్లు వెళ్లొచ్చారని బండి సంజయ్ తెలిపారు. టాస్క్‌ఫోర్స్ కమిటీ ఒక దొంగల ముఠా అంటూ ఎద్దేవా చేశారు

Also Read:జూనియర్ డాక్టర్లు, నర్సుల సమస్యలపై తక్షణమే ప్రతిపాదనలు పంపండి: కేసీఆర్

కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం నాడు గాంధీ ఆసుపత్రిలో పర్యటించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకొన్నారు. ఆసుపత్రిలో కరోనా రోగులకు అందుతున్న వైద్య సేవలతో పాటు  ఇతర విషయాలపై ఆయన ఆరా తీశారు. 

ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి తప్పించిన తర్వాత   వైద్య ఆరోగ్య శాఖను కేసీఆర్ తన వద్దే ఉంచుకొన్నారు. సీఎం హోదాలో కేసీఆర్ తొలిసారిగా గాంధీ ఆసుపత్రిని పరిశీలిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 1500 మంది కరోనా రోగులున్నారు. గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులను ఆయన  స్వయంగా తెలుసుకొంటున్నారు. డాక్టర్లు, వైద్య సిబ్బందిని సీఎం కేసీఆర్ అభినందించారు.  

click me!