అసెంబ్లీ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్:ఈ నెల 26 నుండి బస్సు యాత్రలు

By narsimha lode  |  First Published Sep 8, 2023, 5:48 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ నాయకత్వం  కసరత్తు చేస్తుంది.  ఈ నెల  26 నుండి బీజేపీ రాష్ట్రంలో  యాత్రలు చేపట్టనుంది.


హైదరాబాద్: ఈ నెల  26వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని బీజేపీ తలపెట్టింది. మూడు జోన్లుగా విభజించి ఆ యాత్రలను నిర్వహించనున్నారు. 19 రోజుల పాటు బీజేపీ యాత్రలు నిర్వహించనుంది.జోన్-1 ను కొమరం భీమ్  జోన్ గా నిర్ణయించారు. ఈ జోన్ లో  ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, బాసర జిల్లాలున్నాయి.  జోన్ -2 ను కృష్ణా జోన్ గా  గుర్తించారు.  మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలను ఏర్పాటు చేశారు.జోన్-3 కు గోదావరి జోన్ గా పేరు పెట్టారు.ఈ జోన్ లో  ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాలుంటాయి.

కొమరంభీమ్ జోన్ లో సాగే యాత్ర  బాసర నుండి ప్రారంభం కానుంది. ఈ యాత్రకు బండి సంజయ్ నాయకత్వం వహించే అవకాశం ఉంది. కృష్ణా జోన్ లో జరిగే యాత్రకు  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  నాయకత్వం వహించనున్నారు. సోమశిల నుండి  ఈ యాత్ర ప్రారంభించనున్నారు.  గోదావరి జోన్ లో  ప్రారంభమయ్యే యాత్రకు  ఈటల రాజేందర్ నేతృత్వం వహించనున్నారు.ఈ యాత్రల ముగింపును పురస్కరించుకొని హైద్రాబాద్ లో భారీ సభలను నిర్వహించాలని బీజేపీ భావిస్తుంది.ఈ సభకు ప్రధాని నరేంద్ర మోడీని బీజేపీ ఆహ్వానించనుంది.

Latest Videos

ఈ యాత్రల నిర్వహణ విషయమై  ప్రకాష్ జవదేకర్, సునీల్ భన్సల్,  కిషన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ముఖ్య నేతలతో చర్చించారు. బస్సు యాత్రలో ప్రస్తావించాల్సిన అంశాలపై  చర్చించారు. మరో వైపు ఎన్నికలకు సంబంధించి  20 కమిటీల ఏర్పాటుపై కూడ ఈ సమావేశంలో చర్చించారు.  మరో వైపు  రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితిపై  కూడ  చర్చించారు. ఇప్పటికే  ఆయా రాష్ట్రాల నుండి వచ్చిన బీజేపీ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన నివేదిక ఆధారంగా  ఏం చేయాలనే దానిపై  నేతలు  చర్చించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం ఏ రకమైన వ్యూహంతో వెళ్లాలనే దానిపై  బీజేపీ నేతలు చర్చించారు. ఇటీవల ఖమ్మం జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా రాష్ట్ర నేతలకు  దిశా నిర్ధేశం చేశారు.

also read:వెయ్యికి పైగా ధరఖాస్తులు: టిక్కెట్ల కోసం జితేందర్ రెడ్డి, వికాస్ రావు అప్లికేషన్లు

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగనుంది.  గతంలో వచ్చిన ఎన్నికల ఫలితాలు సానుకూల ఫలితాలు ఇవ్వడంతో  బీజేపీ నేతలు  రానున్న రోజుల్లో కూడ  అదే రకమైన ఫలితాలు వస్తాయనే ఆశాభావంతో ఉన్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడ  తెలంగాణపై  ఫోకస్ ను మరింత పెంచింది. 

 



 

click me!