ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలంటూ పోలీసుల నోటీసులు.. హైకోర్టులో బీజేపీ పిటిషన్

Siva Kodati |  
Published : Aug 23, 2022, 07:01 PM ISTUpdated : Aug 23, 2022, 07:08 PM IST
ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలంటూ పోలీసుల నోటీసులు.. హైకోర్టులో బీజేపీ పిటిషన్

సారాంశం

ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ బీజేపీ నేతలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ మేరకు హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. 

కాగా.. ప్రజా సంగ్రామ యాత్ర ఆపాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు వరంగల్ పోలీసులు మంగళవారం నాడు నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వర్ధన్నపేట ఏసీపీ బండి సంజయ్ కు నోటీసులు పంపారు. పాదయాత్రలో విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ యాత్ర ఇలానే కొనసాగితే శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని పోలీసులు అభిప్రాయపడ్డారు. పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్రకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు.

ALso REad:ప్రజా సంగ్రామ యాత్ర నిలిపివేయాలి: బండి సంజయ్ కు వరంగల్ పోలీసుల నోటీసులు

ఇకపోతే.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ శ్రేణులు ఆందోళన చేశాయి. కవిత ఇంటి ముందు ధర్నాకు నిన్న బీజేపీ శ్రేణులు ప్రయత్నించాయి.ఆందోళన చేసిన బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. దీంతో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా తాను బస చేసిన చోటునే బండి సంజయ్ దీక్షకు ప్రయత్నించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుండి బండి సంజయ్ ను కరీంనగర్ లోని ఆయన ఇంటికి తరలించారు. అయితే తాను ఎక్కడ పాదయాత్ర నిలిపివేశానో అక్కడి నుండే పాదయాత్రను ప్రారంభిస్తానని కూడా కరీంనగర్ లో బండి సంజయ్ ప్రకటించారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర చేసే రూట్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున పాదయాత్రను విరమించుకోవాలని కూడా ఆ లేఖలో ఏసీపీ బండి సంజయ్ ను కోరారు. పాదయాత్రను ఇక్కడే విరమించుకోవాలని కోరారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu